Prime9

WTC Final 2025: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో పట్టు బిగిస్తున్న ఆసీస్.. ఆదుకున్న అలెక్స్!

South Africa vs Australia WTC Final 2025: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతోంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజూ ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే, 20 ఏళ్లల్లో 2005 నుంచి ఇప్పటివరకు లార్డ్స్ వేదికగా ఒకే ఒక్కసారి మాత్రమే 200కు పైగా టార్గెట్ చేధించినట్లు రికార్డు ఉంది.

 

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ఓపెనర్ వాజా(6) తొందరగానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత లబుషేన్(22) నిలకడగా ఆడాడు. ఇక, కామెరూన్ గ్రీన్ డకౌట్ గా వెనుదిరగగా.. స్టీవ్ స్మిత్(13), వెబ్ స్టర్(9), కమిన్స్(6), హెడ్(9) తొందరగానే పెవిలియన్ చేరారు. కష్టాల్లో ఉన్న ఆసీస్‌ను అలెక్స్ క్యారీ(43) పరుగులతో ఆదుకున్నాడు. ప్రస్తుతం మిచెల్ స్టార్క్(16), లైయన్(1) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, ఎంగిడి చెరో మూడు వికెట్లు తీయగా.. యాన్సన్, ముల్డర్ తలో వికెట్ పడగొట్టారు.

 

అంతకుముందు, తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 212 రన్స్ కు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 138 పరుగులకే కుప్పకూలింది. పేసర్ కమిన్స్ దెబ్బకు దక్షిణాఫ్రికా పరుగుల చేయలేకపోయింది. కమిన్స్ బౌలింగ్ ధాటికి బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. మొత్తం 5 వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది.

Exit mobile version
Skip to toolbar