Site icon Prime9

Ind vs Aus 4th Test: శుభ్ మన్ గిల్‌ శతకం.. ఆసీస్‌కు ధీటుగా భారత్ బదులు

ind vs aus

ind vs aus

Ind vs Aus 4th Test: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు రసవత్తరంగా మారుతోంది. మూడో రోజు ఆటలో.. శుభ్ మన్ గిల్ స్వదేశంలో తొలి శతకం సాధించగా.. కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో ఆస్ట్రేలియాకు ధీటుగా భారత్ బదులు ఇస్తోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.

గిల్‌ సెంచరీ.. కోహ్లీ హాఫ్‌ సెంచరీ..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా చివరి టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంగి. మూడో రోజు ఆటలో గిల్ స్వదేశంలో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ కు తోడుగా కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో ఆట ముగిసే సమయానికి.. టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 59పరుగులు.. రవీంద్ర జడేజా 16 లో క్రీజులో కొనసాగుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌ లో భారత్ ఇంకా 191 పరుగులు వెనుకబడి ఉంది. ఇక ఈ మ్యాచ్ లో శుభ్‌మన్‌ గిల్ 235 బంతుల్లో 128 పరుగులు సాధించాడు. ఇందులో 12 ఫోర్లు.. ఒక సిక్సర్ ఉంది. ఛెతేశ్వర్‌ పుజారా 42 పరుగులతో గిల్ కు అండగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్‌ లైయన్‌, మాథ్యూ కునెమన్‌, టాడ్‌ మార్ఫీ తలో వికెట్‌ పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 480 పరుగులకు ఆలౌటైంది.

ఓవర్‌ నైట్ స్కోర్ 36 తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా.. నిలకడగానే ఆట కొనసాగించింది. లంచ్ విరామానికి ముందు.. రోహిత్ శర్మ 35 పరుగుల వద్ద కునెమన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పూజారా గిల్‌ తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రెండో సెషన్‌ లో భారత్ బ్యాటర్లు నిదానంగా ఆడారు. ఆ తర్వాత కాస్త దూకుడు పెంచి.. పరుగులు రాబట్టారు. గిల్ సెంచరీ పూర్తి అయ్యాక కాసేపటికే పుజారా ఔటయ్యాడు. ఇక మూడో సెషల్ లో కోహ్లీ దూకుడు పెంచడంతో.. భారత్ స్కోర్ పరుగులు పెట్టింది. ఆ కొద్ది సేపటికే గిల్‌.. లైయన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు.

సొంతగడ్డపై తొలి సెంచరీ (Ind vs Aus 4th Test)

కేఎల్ రాహుల్ ని తప్పించడంతో చోటు సంపాదించుకున్న గిల్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మూడో టెస్టులో ఆకట్టుకోలేకపోయిన గిల్.. నాలుగో టెస్టులో సెంచరీతో రెచ్చిపోయాడు. మూడో రోజు గిల్ తన వికెట్ పడకుంజా జాగ్రత్త ఆడుతూ శతకం పూర్తి చేసుకున్నాడు. కాగా ఇది గిల్ కు టెస్టుల్లో రెండో సెంచరీ. ఆస్ట్రేలియాపై ఇదే మెుదటి సెంచరీ. ఇక గిల్‌ శతకం పూర్తైన తర్వాత పుజారా ఎల్బీడబ్ల్యూ కావడంతో మైదానంలో అడుగుపెట్టిన కోహ్లి.. గిల్‌కు చేయి అందించి అతడిని ప్రశంసించాడు. కాగా నాథన్‌ లియోన్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కావడంతో గిల్‌ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. 235 బంతులు ఎదుర్కొన్న అతడు 12 ఫోర్లు, ఒక సిక్సర్‌సాయంతో 128 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు.

Exit mobile version