Site icon Prime9

IPL 2025: ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై పంజాబ్ గెలుపు

Shreyas Iyer Stars as Punjab Kings Defeat Gujarat Titans: ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ గెలుపొందింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 

తొలుత టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంశ ఆర్య(47), శ్రేయస్97), శశాంక్ సింగ్(44) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. అయితే మూడో స్థానంలో వచ్చిన శ్రేయస్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అందరూ సెంచరీ చేస్తారని భావించారు. కానీ శ్రేయస్ తన సెంచరీ కంటే జట్టు భారీ స్కోరుకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో చివరి ఓవరిలో శశాంక్ 23 పరుగులు రాబట్టాడు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 3 వికెట్లు పడగొట్టగా.. రబాడ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

 

అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో గుజరాత్ టైటాన్స్ పోరాడి ఓడింది.సాయిసుదర్శన్(74), బట్లర్(54), రూతర్ ఫోర్డ్(46), గిల్(33) పోరాడినా భారీ స్కోరు ఉండడంతో తలవంచక తప్పలేదు. అయితే ప్రారంభం నుంచి దూకుడుగా ఆడుతున్న సుదర్శన్ మ్యాచ్‌ను గెలిపిస్తాడని అనుకున్న తరుణంగా చివరిలో తడబడి పెవిలియన్ చేరాడు. చివరిలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వైశాక్ వేసిన ఓవర్లలో ఎక్కువగా పరుగులు రాకపోవడంతో గుజరాత్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. 18వ ఓవర్‌లో బట్లర్ ఔట్ కావడంతో చివరి ఓవర్‌లో 27 పరుగులు చేయాల్సి వచ్చింది. అర్ష్ దీప్ వేసిన చివరి ఓవర్‌లో 15 పరుగులే వచ్చాయి. దీంతో గుజరాత్ 11 పరుగుల తేడాతో ఓడింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ రెండు వికెట్లు, యాన్సెన్, స్టాయినిస్ తలో వికెట్ తీశారు.

Exit mobile version
Skip to toolbar