Site icon Prime9

Sania Mirza: గ్రాండ్ స్లామ్ ఓటమితో కన్నీటి పర్యంతమైన సానియా

Sania mirza

Sania mirza

Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా (Sania Mirza) తన చివరి గ్రాండ్ స్లామ్ ను ఓటమితో ముగించింది.

రోహన్ బోపన్నతో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్(Australian Open Final )మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్ ఆడిన సానియా మీర్జా 6-7,2-6 తో ఓటమి పాలైంది.

బ్రెజిలియన్ జోడీ లూయిసా స్టెఫానీ , రాఫెల్ మాటోస్ చేతిలో సానియా -బోపన్న జోడీకి షాక్ తగిలింది.

తొలి సెట్ లో 2-2, 3-2 ఆధిక్యంలోకి వెళ్లినా..తర్వాత 0-2 తో వెనుకబడింది సానియా జోడి. తర్వాత సెట్ లో పుంజుకున్నా, బ్రెజిల్ జోడీ మాత్రం మ్యాచ్ పై పూర్తి పట్టు సాధించారు.

దీంతో సానియా జోడి ఓటమి కి చవిచూడక తప్పలేదు. కాగా, ఈ సానియా మీర్జా ఈ మ్యాచ్ ఓటమితో అంతర్జాతీయ టెన్నిస్ కెరీరు కు వీడ్కోలు పలికినట్టు అయంది.

ఈ టోర్నీలో సానియా మహిళల డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో పాల్గొంది. మహిళ డబుల్స్ నిరాశపర్చినా.. మిక్స్ డ్ డబుల్స్ లో రోహన్ బోపన్నతో కలిసిన ఫైనల్ కు చేరింది.

 

సానియా భావోద్వేగం..(Sania Mirza)

మ్యాచ్ అనంతరం తన కెరీర్ గురించి మాట్లాడిన సానియా మిర్జా కన్నీటి పర్యంతమయ్యారు. ‘నా కెరీర్ మెల్ బోర్న్ లో ప్రారంభమైంది.

ఈ రోజు నా కొడుకు ముందు గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. నా గ్రాండ్ స్లామ్ ముగించడానికి ఇంతకన్నా గొప్ప వేదిక ఉంటుందని అనుకోను. ’ అంటూ కన్నీరు పెట్టుకుంది.

సానియా మాట్లాడిన వీడియోను ఆస్ట్రేలియా ఓపెన్ ట్వీటర్ షేర్ చేసింది. ‘వుయ్ లవ్ యూ సానియా’ అంటూ వీడ్కోలు పలికింది.

కాగా, ఆస్ట్రేలియా ఓపెన్ తో తన గ్రాండ్ స్లామ్(Sania Mirza Retirement) ప్రయాణాన్ని ముగించనున్నట్టు 36 ఏళ్ల సానియా ఇంతముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరిలో దుబాయ్ లో జరిగే డబ్ల్యూటీఏ ఈవెంట్ లో సానియా తన చివరి టోర్నమెంట్ ను ఆడనున్నారు. సానియా కెరీలో ఇది 11 వ గ్రాండ్ స్లామ్ ఫైనల్.

ఆమె 6 గ్రాండ్ స్లామ్ లతో సహా మొత్తం 43 డబుల్స్ టైటిల్స్ ను గెలుచుకుంది. గతంలో మహిళల డబుల్స్ లో 91 వారాల పాటు డబ్ల్యూటీఏ నంబర్ 1 ప్లేయర్ గా సానియా నిలిచింది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

Exit mobile version