అంత‌క‌ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్(39; 32 బంతుల్లో 4 పోర్లు, 1 సిక్స్‌), కైల్ మేయర్స్(51; 42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) శుభారంభం అందించారు. అయితే.. రాజ‌స్థాన్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో 11 ఓవ‌ర్లకు 82 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. ఆ తర్వాత వెంటనే రాహుల్, ఆయుష్ బ‌దోని (1) క్లీన్ బౌల్డ్ కావ‌డంతో 86 ప‌రుగులకే ల‌క్నో రెండో వికెట్ కోల్పోయింది. ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి కైల్ మేయ‌ర్స్ 40 బంతుల్లో అర్ధ‌శ‌త‌కంతో రాణించడంతో లక్నోకు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. ఇక చివర్లో మార్కస్ స్టోయినిస్ (21; 16బంతుల్లో 2 ఫోర్లు), నికోల‌స్ పూర‌న్‌ (28; 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌)లు రాణించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో అశ్విన్ రెండు వికెట్లు తీయ‌గా, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మలు ఒక్కో వికెట్ ప‌డ‌గొట్టారు.