Site icon Prime9

RCB won by 9 wickets: రాజస్థాన్ రాయల్స్‌పై బెంగళూరు సూపర్ విక్టరీ!

Royal Challengers Bengaluru won by 9 Wickets Against Rajasthan Royals

Royal Challengers Bengaluru won by 9 Wickets Against Rajasthan Royals

Royal Challengers Bengaluru won by 9 wickets against Rajasthan Royals in IPL 2025 28th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో 28వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలబడింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో బెంగళూరు సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ నాలుగో విజయం నమోదు చేసుకోగా.. రాజస్థాన్ నాలుగో పరాజయం పొందింది.

 

తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(75) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సంజు శాంసన్(15) విఫలమయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పరాగ్(30), యశస్వీలు ఔట్ కావడంతో రాజస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చివరిలో ధ్రువ్ జురెల్(35) మెరుపు షాట్లు ఆడడంతో చివరి 4 ఓవర్లలో 47 పరుగులు వచ్చాయి. దీంతో రాజస్థాన్ 173 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్, యశ దయాళ్, హేజిల్ వుడ్, కృనాల్ పాండ్య తలో వికెట్ తీశారు.

 

174 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెనర్లు ఫిల్ సాల్ట్(65), విరాట్ కోహ్లీ(62) సూపర్ ఇన్నింగ్స్ ఆడారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ 92 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇంపాక్ట్ ప్లేయర్ కార్తికేయ బౌలింగ్‌లో సాల్ట్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పడిక్కల్‌తో కలిసి విరాట్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వికెట్ కోల్పోకుండా 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఇంకా 15 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ విజయం నమోదు చేసింది.

 

 

Exit mobile version
Skip to toolbar