Rohit Sharma: బిగ్ మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మకు గాయం

ఇంగ్లండ్ లోని ఓవల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ బిగ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు నెట్స్ లో శ్రమిస్తున్నాయి. కాగా, రేపు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు కలవరపెట్టే న్యూస్ బయటకు వచ్చింది.

Rohit Sharma: ఇంగ్లండ్ లోని ఓవల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ బిగ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు నెట్స్ లో శ్రమిస్తున్నాయి. కాగా, రేపు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు కలవరపెట్టే న్యూస్ బయటకు వచ్చింది. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎడమ బొటన వేలికి గాయమైనట్టు తెలుస్తోంది. నెట్ ప్రాక్టీస్‌ సెషన్స్‌లో భాగంగా మంగళవారం రోహిత్ గాయపడినట్టు సమాచారం. వెంటనే భారత ఫిజియోలు వైద్యం అందించారు.

 

తిరిగి ప్రాక్టీస్‌ సెషన్స్‌లో(Rohit Sharma)

చికిత్స అనంతరం వేలికి బ్యాండేజ్ వేసుకుని రోహిత్ తిరిగి ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొన్నాడు. దీంతో గాయం తీవ్రమైనది కాదని అర్ధమవుతోంది. అయితే రోహిత్‌ గాయంపై అధికారిక ప్రకటన రాలేదు. గాయం పెద్దది కాకపోవడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ రూపంలో బ్యాటర్ గా నిరూపించుకుని, కెప్టెన్ గా జట్టుకు ఓ చరిత్రాత్మక విజయం అందించాలని ఆశిస్తున్నారు. మరో వైపు ఇంగ్లాండ్ లో రోహిత్ కు రికార్డు కూడా బాగుంది. ఆడిన 5 టెస్టుల్లో 402 పరుగులు సాధించాడు. ఓవల్ లో 2021 లో ఇంగ్లండ్ పై రోహిత్ శతకం(127) బాదాడు.

తొలిసారి ఢీ(Rohit Sharma)

లండన్ లోని ఓవల్ మైదానంలో భారత్‌, ఆస్ట్రేలియా మొదటి సారి ఢీకొట్టబోతున్నాయి. ఈ వేదికగా టీమిండియా ఇప్పటి వరకు 14 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ మ్యాచ్‌లన్నీ ఇంగ్లాండ్‌తో ఆడారు. ఇంగ్లాండ్ జట్టు 5 విజయాలు సాధించగా.. 2 మ్యాచ్‌ల్లో టీంఇండియా గెలుపొందింది. మిగిలిన 7 మ్యాచ్‌లు డ్రా గాముగిశాయి. ఈ మైదానంలో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ 1936 ఆగస్టులో జరిగింది. అందులో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. 2021 సెప్టెంబరులో భారత్ చివరి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 157 పరుగుల తేడాతో గెలుపొందింది.

తాజాగా డబ్ల్యూటీసీ ఫైనలో భారత్ విజయం సాధిస్తే.. వన్డే, టీ20, టెస్టు మూడు ఫార్మాట్లలో వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచిన మొదటి జట్టుగా టీంఇండియా చరిత్ర సృష్టిస్తుంది. భారత్ ఇప్పటి వరకు వన్డే, టీ20 వరల్డ్ కప్ లో ఛాంపియన్స్ గా నిలిచిన విషయం తెలిసిందే.