Ravindra Jadeja: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇండోర్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టెస్టులో జడేజా ప్రత్యేక రికార్డును సృష్టించాడు.
మూడో టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్ లో ట్రెవిస్ హెడ్ వికెట్ తీయడంతో ఇంటర్నేషనల్ క్రికెట్ లో జడేజా 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. కాగా, బాల్ తో 500 వికెట్లు, బ్యాట్ తో 5 వేల పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్ గా జడ్డూ నిలిచాడు.
అయితే, ఇంతకుముందు కపిల్ దేవ్ ఒక్కడే ఈ ఘనతను సాధించాడు. ప్రస్తుతం జడేజా ఆ ఫీట్ సాధించి.. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 500 వికెట్లు సాధించిన రెండో ప్లేయర్ గా ఘనత సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో ఓవరాల్ గా ఈ ఫీట్ సాధించిన 11 వ ప్లేయర్ గా జడేజా గుర్తింపు పొందాడు.
500 వికెట్ల జాబితాలో కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్, షాన్ పోలాక్, చిమిందా వాస్, డానియల్ వెటోరి, జాక్వస్ కలీస్, షాహిద్ ఆఫ్రిదీ, షకీబ్ అల్ హసన్ లు ఉన్నారు.
ఇక మూడ్ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు విఫలం అయ్యారు.
ఆసీస్ స్పిన్ ధాటికి చేతులెత్తయడంతో.. 109 పరగులకే భారత్ మెుదటి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ బ్యాటర్లలో కోహ్లి మాత్రమే టాప్ స్కోరర్ గా నిలిచాడు.
మెుదటి ఇన్నింగ్స్ లో కోహ్లి 22 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్కోరు శుబ్‌మన్ గిల్ 21. దీనిని బట్టి పిచ్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియా స్పిన్నర్లలో మాథ్యూ కుహ్నెమన్ 5 వికెట్లు తీయగా.. నాథన్ లియోన్ మూడు, టాడ్ మర్ఫీ ఒక వికెట్ తీశాడు.
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి కీలక బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.
ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఉమేశ్ యాదవ్ 17 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు ఉన్నాయి. దీంతో భారత్ 100 పరుగుల మార్కును దాటింది.
Decision Overturned!
A successful DRS for #TeamIndia as @imjadeja gets the first wicket of the innings!
Relive the dismissal here 📽️
Live – https://t.co/t0IGbs1SIL #INDvAUS @mastercardindia pic.twitter.com/zwU5HeijXR
— BCCI (@BCCI) March 1, 2023
ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా 109 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందులో ఒక్కరు కూడా కనీసం 30 పరుగులు చేయలేకపోయారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలవడం మినహా ఏది టీమిండియాకు ఏది కలిసిరాలేదు.
ఈ క్రమంలోనే టీమిండియా టెస్టు క్రికెట్‌లో చెత్త రికార్డును మూటగట్టుకుంది.
టీమిండియా స్వదేశంలో ఆడిన టెస్టుల్లో అత్యల్ప స్కోరు నమోదు చేయడం గత 15 ఏళ్లలో ఇది నాలుగోసారి మాత్రమే.
గతంలో 2008లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో 76 పరుగులకే ఆలౌట్ అయింది.
ఆ తర్వాత 2017 పుణేలో ఆస్ట్రేలియాతో టెస్టులో 105 పరుగులకు కుప్పకూలింది. మళ్లీ అదే టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులకు ఆలౌట్ అయింది.
తాజాగా ఇండోర్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 109 పరుగులకు కుప్పకూలింది.