ICC Ranks: బోర్డర్ గవాస్కరో ట్రోఫిలో భాగంగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ స్పిన్నర్లు అరుదైన రికార్డులు సృష్టించారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో స్పిన్నర్లు సత్తా చాటారు. తమ స్థానాలను మెరుగుపర్చుకొని ముందుకు ఎగబాకారు. ఇక టెస్టు క్రికెట్ లో టాప్ బౌలర్ గా అశ్విన్ రికార్డులకెక్కాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్లు అదరగొట్టారు. టెస్టుల్లో సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు మెుదటి స్థానంలో ఉన్న పేసర్ జేమ్స్ అండర్సన్ రెండో స్థానానికి పడిపోయాడు. ప్రస్తుతం అశ్విన్ 864 పాయింట్లతో మెుదటి ర్యాంక్ సాధించగా.. 859 పాయింట్లతో అండర్సన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా 763 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. 795 పాయింట్లతో పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగో స్థానం సంపాదించుకున్నాడు. టెస్టు బ్యాటర్ల జాబితాలో జో రూట్ మూడో స్థానంలో ఉండగా.. ఆసీస్ బ్యాటర్లు మార్నస్ లబుషేన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఆసీస్ తో జరుగుతున్న సిరీస్ లో రవీంద్ర జడేజా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. తన ఆటతీరుతో క్రికెట్ దిగ్గజాల సరసన జడ్డూ చోటు సంపాదించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు, 5వేలకుపైగా పరుగులు సాధించిన ఆటగాడిగా అవతరించాడు. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేయడంతో ద్వారా అన్ని ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయంగా 500వ వికెట్ తీసినట్లైంది. ఇప్పటి వరకు 503 వికెట్లతో పాటు.. మెుత్తం 5,527 పరుగులు సాధించాడు. గతంలో భారత్ తరఫున కపిల్ దేవ్ ఈ ఘనతను అందుకొన్నాడు. కపిల్ దేవ్ 356 మ్యాచుల్లో 687 వికెట్లు, 9వేలకుపైగా పరుగులు సాధించాడు. ఇక మూడో టెస్టులో మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. ఒక్క బౌలర్ మాత్రం అడ్డుగా నిలిచాడు. కీలకమైన నాలుగు ఆసీస్ వికెట్లను తీసి భారత్ పరువును నిలిపాడు జడ్డూ.
టీమ్‌ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అది కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని సమం చేశాడు. దీంతో మాజీ కోచ్ రవిశాస్త్రిని కూడా అధిగమించడం విశేషం. ఆసీస్‌తో మూడో టెస్టులో ఉమేశ్ రెండు సిక్స్‌లు బాదాడు. దీంతో టెస్టు కెరీర్‌లో 24 సిక్స్‌లు కొట్టిన బ్యాటర్‌గా మారాడు. ఈ క్రమంలో అత్యధిక సిక్స్‌లు కొట్టిన 17వ బ్యాటర్‌గా అవతరించాడు. విరాట్ కూడా 24 సిక్స్‌లు కొట్టగా.. రవిశాస్త్రి 22 సిక్స్‌లు సాధించాడు. భారత్ తరఫున అత్యధికంగా వీరేంద్ర సెహ్వాగ్ (91) పేరిట ఉంది. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ (78), సచిన్ (69), రోహిత్ (68), కపిల్ దేవ్ (61) టాప్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మొదటి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన ఆసీస్ మూడో టెస్టులో గట్టి పోటీనిస్తోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మొదటి ఇన్నింగ్స్‌లో 47 పరుగుల ఆధిక్యంలో ఉంది. పీటర్ హాండ్స్‌కాంబ్ (7), కామెరూన్ గ్రీన్ ( 6) క్రీజులో ఉన్నారు. ఉస్మాన్ ఖవాజా (60) అర్ధ శతకంతో మెరవగా.. లబుషేన్ (31), స్టీవ్ స్మిత్ (26), ట్రావిస్ హెడ్ (9) పరుగులు చేశారు. ఈ నాలుగు వికెట్లను జడేజా పడగొట్టినవే కావడం విశేషం. జడ్డూ అడ్డుగా లేకుంటే ఆసీస్ ఇంకాస్త ఆధిపత్యం ప్రదర్శించేది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ స్పిన్నర్ల ధాటికి భారత్ 109 పరుగులకు ఆలౌటైంది.