Site icon Prime9

Rashid khan: టీ20 చరిత్రలో ప్రపంచ రికార్డు.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత

Rashid Khan breaks Dwayne Bravo’s record: టీ20 చరిత్రలో అరుదై న రికార్డు నమోదైంది. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మొత్తం ఇంటర్ నేషనల్, లీగ్‌లు కలిపి 460 మ్యాచ్‌లలో 633 వికెట్లు పడగొట్టి బ్రావో(631) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు.

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఎస్ఏ20 లీగ్‌లో ఎంఐ కేప్ టౌన్ తరఫున ఆడుతున్న రషీద్ ఖాన్.. పార్ల్ రాయల్స్‌పై 2 వికెట్లు తీయడంతో ఈ ఘనత సాధించాడు. ఇందులో అఫ్గానిస్తాన్ తరపున 161 వికెట్లు తీయగా.. మిగిలిన 472 వికెట్లు దేశవాళీతోపాటు వివిధ లీగ్ మ్యాచ్‌లో తీశాడు.

Exit mobile version
Skip to toolbar