Site icon Prime9

Rain In Bengaluru: బెంగళూరులో భారీ వర్షం.. ఆర్సీబీ కి వరుణుడు షాక్ ఇస్తాడా?

Rain In Bengaluru

Rain In Bengaluru

Rain In Bengaluru: ఐపీఎల్‌ 2023 సీజన్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్ లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఢిల్లీ తో జరిగిన ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్, కోలకతా పై విజయంతో లక్నోలు కూడా ప్లే ఆఫ్ కు దూసుకెళ్లాయి. అయితే ప్లే ఆఫ్స్ చేరుకునే మరో జట్లు ఏది అనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో చివరి లీగ్ మ్యాచ్ ను ఆడేందుకు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ లు సిద్ధమయ్యాయి.

 

బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదిక గా ఈ మ్యాచ్ ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలుపే ఆర్సీబీకి కీలకం కానుంది. ఇందులో విక్టరీ కొడితే ప్లే ఆఫ్ బెర్తును కన్ఫామ్ అవుతుంది. అయితే ఇదే సయయంలో ఆర్సీబీ ఫ్యాన్స్ కు చేదు వార్త. బెంగళూరులో భారీ వర్షం పడుతుండటంతో మ్యాచ్ జరుగుతుంతో.. లేదో అనే ఆందోళన కలుగుతోంది.

 

 

 

 

ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే..(Rain In Bengaluru)

నిన్నటి నుంచి బెంగళూరులో భారీ వర్షం పడుతోంది. ఆదివారం కూడా భారీ గాలులు, వడగండ్లతో వర్షం కురుస్తోంది. దీంతో ఆర్సీబీ, గుజరాత్ జట్ల మ్యాచ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వర్షం లేకుండా మ్యాచ్‌ జరిగితే బెంగళూరు విజయం సాధించాలి. అప్పుడు 16 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుతుంది.

ఒక వేళ వర్షం పడి మ్యాచ్‌ నిలిచిపోతే.. గుజరాత్‌ (18 పాయింట్లు), ఆర్సీబీ (14 పాయింట్లు) జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. అప్పుడు గుజరాత్‌ కు 19 పాయింట్లు, బెంగళూరు పాయింట్ల సంఖ్య 15 కి చేరుతుంది.

ఆదివారం మరో మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్‌తో ముంబై తలపడుతోంది. ఈ మ్యాచ్ లో ముంబై (14 పాయింట్లు) ఓడిపోతేనే బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

అలా కాకుండా ముంబై గెలిస్తే 16 పాయింట్లతో నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం అవుతుంది.

ముంబై, బెంగళూరు తమ చివరి మ్యాచుల్లో ఓడిపోతే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా ప్లేఆఫ్స్‌లోకి వెళ్లొచ్చని ఆశపడుతోంది రాజస్థాన్ రాయల్స్(14 పాయింట్లు).

 

Exit mobile version