Prime9

PBKS vs RCB: నిప్పులు చెరిగిన బెంగళూరు బౌలర్లు, 101 పరుగులకు పంజాబ్ ఆలౌట్

PBKS vs RCB:  బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరిగారు. వీరి ధాటికి పంజాబ్ బ్యాటింగ్ లైనపై పేకమేడలా కూలిపోయింది. యష్ దయాల్, భువనేశ్వర్, ఓపెనర్లను పడగొట్టగా… హజల్ వుడ్, సుయాంష్ మిడిల్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. వంద పరుగులే కష్టమనుకున్న దశలో ఆమ్ రాజీ 12 బంతులకు 18పరుగులు చేశాడు. 14.1 ఓవర్లలో 101పరుగులు చేసిన పంజాబ్ టీం ఆల్ అవుట్ అయింది.

 

 

యష్ దయాల్ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికి ఆర్యను పెవిలియన్ కు చేర్చాడు. ఆర్మ 5 బంతుల్లో 7 పరుగులు చేశాడు. భువనేశ్వర్ వేసిన రెండవ ఓవర్ చివరి బంతికి పి.సింగ్ ను ఔట్ చేశాడు. ఇతను 10బంతుల్లో 18పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ తక్కువ స్కోరుకే ఓపెనర్లను కోల్పోయింది. హెజల్ వుడ్ వేసిన మొదటి ఓవర్ నాలుగవ బంతికి శ్రేయస్ ను ఔట్ చేశాడు. ఇతను 3 బంతులాడి 2 పరుగులు చేశాడు. ఆతర్వాత వచ్చిన నేహాల్ వధేరా 10బంతుల్లో 8పరుగులు చేసి దయాల్ కు చిక్కాడు. మార్కస్ 17బంతుల్లో 26పరుగులు చేసి సుయాష్ శర్మ బాల్ కు బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత వచ్చిన శషాంక్ సింగ్ సుయాంష్ శర్మ బాల్ కే బౌల్డ్ అయ్యాడు. ఇతను 5బంతుల్లో 3 పరుగులు చేశాడు. ముషీర్ ఖాన్ సుయాంష్ శర్మ బౌల్ కు ఎల్బీగా డక్ అవుట్ అయ్యాడు.

 

 

 

బెంగళూరు బౌళర్లలో హజల్ వుడ్ 3.1 ఓవర్లు వేసి 21పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సుయాష్ శర్మ మూడు వికెట్లకు 17పరుగులు ఇచ్చి 3వికెట్లు తీశాడు. యష్ దయాల్ 4 ఓవర్లు వేసి 26పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ 2 ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టాడు. షెపర్డ్ 1ఓవర్ వేసి 5పరుగులు ఇచ్చి 1వికెట్ తీశారు.

 

 

 

Exit mobile version
Skip to toolbar