Site icon Prime9

Lionel Messi: పారిస్ జట్టుకు వీడ్కోలు పలికిన మెస్సీ.. కారణం అదేనట

Lionel Messi

Lionel Messi

Lionel Messi: ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ తన క్లబ్ కు వీడ్కోలు పలికారు. గత కొంతకాలంగా క్లబ్‌ యాజమాన్యంతో విబేధాలు ఉండడంతో ఆయన ఆ క్లబ్ నుంచి బయటకు రావాల్సివచ్చింది. అంతే కాకుండా అభిమానుల నుంచి విమర్శల సైతం ఎదుర్కొంటున్న నేపథ్యంలో పారిస్‌ సెయింట్‌ జెర్మన్‌ (పీఎస్జీ) జట్టుతో తన రెండేళ్ల బంధానికి లియొనెల్‌ మెస్సి చిరునవ్వుతో ముగింపు పలికాడు.

చిరునవ్వుతో బయటకువచ్చాడు(Lionel Messi)

పీఎస్జీ సొంత మైదానం పార్క్‌ ది ప్రిన్సెస్‌ స్టేడియంలో క్లెర్మాంట్‌తో జరిగిన మ్యాచే అతనికి ఆఖరి అయ్యింది. ఈ మ్యాచ్‌లో పారిస్‌ సెయింట్‌ జెర్మన్‌ జట్టు 2-3తో ఓడింది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మైదానంలో వ్యాఖ్యాత మెస్సి పేరు చెప్పగానే స్టాండ్స్‌లోని అభిమానులంతా మెస్సీని అమర్యాదగా.. అగౌరవపరిచేలా అరిచారు. అదేం పట్టించుకోని మెస్సి.. తన ముగ్గురు పిల్లల చేతులు పట్టుకుని చిరునవ్వుతో మైదానంలో అడుగుపెట్టాడు. కాగా మ్యాచ్ విషయానికి వస్తే పీఎస్జీ తరపున ఆడిన ఆఖరి మ్యాచ్‌లోనూ మెస్సీ గోల్‌ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించినా కూడా గోల్ కొట్టలేకపోయాడు. దాని ఫలితంగా పీఎస్జీ జట్టు ఓటమిని చవిచూసింది. ఇక మ్యాచ్‌ ముగిశాక మెస్సీ సహచర ఆటగాళ్లను హత్తుకుని భావోధ్వేగానికి లోనయ్యాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ చేస్తూ మైదానం నుంచి బయటకు వచ్చాడు. ‘‘ఈ రెండేళ్ల పాటు ఆడే అవకాశం కల్పించిన క్లబ్‌కు, పారిస్‌కు, ఇక్కడి ప్రజలకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో ఈ క్లబ్‌ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అని మెస్సి చెప్పాడు.

పీఎస్జీతో ఆడడం సంతోషంగానే ఉందని మెస్సీ ఈ ఏడాది మార్చిలో ఓ మ్యాచ్ సందర్భంగా చెప్పడంతో మరో ఏడాది కూడా ఇదే క్లబ్‌తోనే కొనసాగుతాడని ఫుట్ బాల్ ప్రియులు అనుకున్నారు. కానీ ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇక ఇటీవల మెస్సీ సౌదీ వెళ్లాడు దానితో అతను సౌదీ అరేబియాకు చెందిన ఓ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతున్నాడని వార్తలు వస్తున్న క్రమంలో.. తమ పర్మిషన్ లేకుండా సౌదీ అరేబియా వెళ్లాడని మెస్సీని క్లబ్‌ సస్సెండ్‌ చేసింది. ఇకపోతే పీఎస్జీ తరపున మెస్సి 32 గోల్స్‌ చేయడంతో పాటు 35 గోల్స్‌లో సాయపడ్డాడు. జట్టుకు రెండు ఫ్రెంచ్‌ లీగ్‌ టైటిళ్లు, ఓ ఫ్రెంఛ్‌ ఛాంపియన్‌ ట్రోఫీ సాధించాడు.

Exit mobile version
Skip to toolbar