Site icon Prime9

Neeraj Chopra : మరోసారి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్‌ లో గోల్డ్ మెడల్

neeraj chopra won gold medal in world athletic championship

neeraj chopra won gold medal in world athletic championship

Neeraj Chopra : జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. హంగేరీ లోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో దేశానికి మరో బంగారు పతకం అందించాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ముందుగా క్వాలిఫైయర్స్‌లో 88.77 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌‌లో అడుగుపెట్టాడు నీరజ్.

neeraj Chopra

ఇక ఫైనల్స్ తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో మారు జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరాడు. ఆ తరువాత వరుసగా 86.32, 84.64, 87.73, 83.98, మీటర్ల దూరానికి విసిరాడు. మరోవైపు నీరజ్ ప్రత్యర్థులు కిషోర్ జెనా 84.77 మీటర్లతో ఐదో స్థానానికి పరిమితం కాగా, డీపీ మను 84.14 మీటర్ల దూరం విసిరి ఆరో స్థానంలో నిలిచాడు. ఈ పోటీల్లో రజతం సాధించిన పాక్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ జావెలిన్‌ను 87.82 మీటర్ల దూరం విసిరాడు. చెక్ క్రీడాకారుడు జాకబ్ వడ్లెచ్ 86.67 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకం సాధించాడు. ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించి గర్వకారణంగా నిలిచిన నీరజ్ చోప్రా ఈ విజయంతో మరింత మంది మనసుల్ని గెలుచుకున్నారు. మరెంతో మందికి ఆదర్శంగా మారారు.

Exit mobile version
Skip to toolbar