WPL 2023: మహిళల ప్రిమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ లీగ్ లో తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో గుజరాత్ జెయింట్స్ ఢీకొంది. ఇక ఈ తొలి మ్యాచ్ అంచనాలకు అందని విధంగా సాగింది. ముంబై ఇండియన్స్ ఏకంగా.. 143 పరుగుల తేడాతో విజయం సాధించంది.
మహిళల ప్రీమియర్ లీగ్ లో మెుదటి మ్యాచ్ లో పరుగుల వరద పారింది. ఓ వైపు పరుగులు వరద పారుతుంటే.. మరోవైపు వికెట్ల మోతా మోగింది. ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్ భారీ విజయం సాధించింది. పురుషుల ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబయి.. మహిళల లీగ్ ఆరంభ పోరులోనూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. డీవై పాటిల్ స్టేడియంలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన.. బెత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. మెుదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 207 పరగులు చేసింది. హర్మన్ 65 హేలీ మాథ్యూస్ 47 పరుగులతో రాణించారు. చివర్లో అమేలియా కెర్ 45 పరుగులతో చెలరేగింది. దీంతో ముంబయి 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. 208 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ 15.1 ఓవర్లలో ఓవర్లలో 64 పరుగులకే ఆలౌటైంది. 29 పరుగులతో హేమలత టాప్ స్కోరర్ గా నిలిచింది.
లక్ష్య ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఇందులో ఎక్కువ సున్నాలు, సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. సబ్బినేని మేఘన (2), బెత్ మూనీ (0 రిటైర్డ్ హర్ట్), హర్లీన్ డియోల్ (0), ఆష్లే గార్డ్‌నర్ (0), అన్నాబెల్ సుదర్‌లాండ్ (6), జార్జియా వేర్‌హమ్ (8), స్నేహ్ రాణా (1), తనుజా కన్వర్ (0), మాన్సీ జోషీ (6) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఆష్లీ గార్డ్‌నర్, బెత్ మూనీ వంటి స్టార్లు ఉన్న గుజరాత్ దీటుగానే ఆడుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆరంభ పోరు ఏకపక్షంగా సాగింది. ముంబయికి గుజరాత్ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్.. ఆరంభంలోనే యాస్తిక (1) వికెట్ పడగొట్టడం ఒక్కటే ఆ జట్టుకు సంతోషాన్నిచ్చిన విషయం. ముందుగా హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ ఆ జట్టు ఇన్నింగ్స్‌కు ఊపు తేగా.. ఆ తర్వాత హర్మన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. 12 ఓవర్లకే ఆ జట్టు స్కోరు 100కు చేరుకోగా.. హర్మన్ కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసింది.
గుజరాత్ పతనాన్ని శాసించి, ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన సైకా ఇషాఖీ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఇషాఖీ ఎవరు.. ఆమె ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు నెటిజన్లు. సైకా ఇషాఖీ గురించి నెట్‌లో సెర్చ్ చేయగా.. ఆమె ఓ దిగువ మధ్యతరగతి బెంగాలీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, లెఫ్ట్ హ్యాండ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన 27 ఏళ్ల ఇషాఖీ.. టీమిండియా తరఫున అరంగేట్రం చేయనప్పటికీ ఇండియా డి వుమెన్, ట్రయల్‌బ్లేజర్స్, బెంగాల్, ఇండియా ఏ వుమెన్ జట్లకు ప్రాతినిధ్యం వహించినట్లుగా తెలుస్తోంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగల సామర్థ్యమున్న ఇషాఖీ.. 2021లో ఇండియా-సితో జరిగిన ఓ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆకట్టుకుంది.