Prime9

IPL 2025: ముంబై ఇండియన్స్ సూపర్ విక్టరీ.. 100 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమి

Mumbai Indians won the Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో కీలక మ్యాచు‌లో గెలుచింది. దీంతో వరుసగా ఆరో విజయాన్ని నమోదు చేసింది. జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 100 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

 

మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్(61), రోహిత్ శర్మ(53) మంచి శుభారంభం అందించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య (48), పాండ్యా(48)లు ఇద్దరు వేగంగా పరుగులు చేశారు. దీంతో ముంబై 217 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ, పరాగ్ చెరో వికెట్ పడగొట్టారు.

 

217 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రాజస్థాన్ బోల్తాపడింది. కేవలం 16.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. రాజస్థాన్ బ్యాటర్లలో జోఫ్రా ఆర్చర్(30) పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. యశస్వి జైస్వాల్(13), నితీష్ రాణా(9), రియాన్ పరాగ్(16), ధ్రువ్ జురెల్(11), శిభమ్ దూబె(16) పరుగులు చేయగా.. వైభవ్ సూర్యవంశీ, షిమ్రాన్ హెట్మెయర్ డకౌట్ అయ్యారు.. ముంబై బౌలర్లలో కర్ల్, బౌల్ట్ తలో 3 వికెట్లు పడగొట్టారు. అలాగే బుమ్రా 2 వికెట్లు తీయగా.. చాహర్, పాండ్యా చెరో వికెట్ తీశారు.

 

ఇదిలా ఉండగా, జైపూర్ వేదికపై ముంబై ఇండియన్స్ 12 ఏళ్ల తర్వాత విజయం సాధించింది. గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ ఆశలు వదులుకుంది. కాగా, అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా ప్లే ఆఫ్స్ రేసు తప్పుకున్న సంగతి తెలిసిందే.

Exit mobile version
Skip to toolbar