WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దిల్లీ ఫైనల్ చేరుకుంది. ఇక మరో ఫైనల్ బెర్త్ కోసం నేడు రంగం సిద్దమైంది. ఫైనల్ బెర్త్ కోసం.. ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి.
గెలిస్తే ఫైనల్ బెర్త్.. (WPL 2023)
మహిళల ప్రీమియర్ లీగ్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దిల్లీ ఫైనల్ చేరుకుంది. ఇక మరో ఫైనల్ బెర్త్ కోసం నేడు రంగం సిద్దమైంది. ఫైనల్ బెర్త్ కోసం.. ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు తలపడుతున్నాయి. డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఇక లీగ్ ఆఖరి మ్యాచ్‌కు దూరమైన యూపీ వారియర్జ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్రేస్ హారిస్ తిరిగి జట్టులోకి వచ్చింది. మరోవైపు ముంబై ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 26న జరగనున్న ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ముంబై సమిష్టిగా ఆడుతోంది. ప్రస్తుతం 8 ఓవర్లకు ఆ జట్టు 62 పరుగులు చేసి ఓ వికెట్ కోల్పోయింది. యాక్సిత బాటియాను.. అంజలి శర్వాని ఔట్ చేసింది. ప్రస్తుతం క్రీజులో హేలీ మాథ్యూస్.. బ్రంట్ కొనసాగుతున్నారు.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, యాస్తికా భాటియా(వికెట్ కీపర్), నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమెలీయా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్
యూపీ వారియర్జ్: అలిస్సా హీలీ(కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, సిమ్రాన్ షేక్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, కిరణ్ నవ్‌గిరే, దీప్తి శర్మ, సోఫీ ఎక్లెస్టోన్, అంజలి సర్వాణి, పార్షవి చోప్రా, రాజేశ్వరి గైక్వాడ్