Bumrah and Rohit back as MI bowl first against RCB: ఐపీఎల్‌లో భాగంగా నేడు ఆసక్తికర పోరు జరగనుంది. ముంబయి వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు బెంగళూరు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయం సాధించగా.. ఒకటి ఓటమి చెందింది. దీంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అలాగే ముంబై ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటమి చెందడంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.
అయితే, ఈ మ్యాచ్‌కు ముందే ముంబైకు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా దూరంగా ఉన్న జసీత్ బుమ్రా.. ఆడేందుకు సిద్దమయ్యాడు. అలాగే లక్నో మ్యాచ్‌తో దూరంగా ఉన్న రోహిత్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్స్ అందుబాటులోకి రావడంతో ముంబై జట్టు బలం మళ్లీ పుంజుకోనుంది. అలాగే బెంగళూరులోనూ బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. ఇరు జట్లు బలంగా కనిపిస్తుండడంతో ఇవాళ జరిగే మ్యాచ్ ఆసక్తికరంగా జరగనుంది.