Site icon Prime9

IPL 2025 33rd Match: హైదరాబాద్‌తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై

Mumbai Indians vs Sunrisers Hyderabad

Mumbai Indians vs Sunrisers Hyderabad

Mumbai Indians own the toss and opt to bowl Agianst Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ఇవాళ ముంబై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ తీసుకుంది. ఇక, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు ఆరు చొప్పున మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో రెండు జట్లు చెరో రెండు గెలిచాయి. దీంతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్ 9వ స్థానంలో ఉండగా.. ముంబై 7వ స్థానంలో కొనసాగుతోంది.

 

ఈ సీజన్‌లో ఇరు జట్లను పరిశీలిస్తే.. సన్‌రైజర్స్ తొలి మ్యాచ్ రికార్డు విజయం నమోదు చేసింది. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. చివరగా పంజాబ్ కింగ్స్‌పై హైదరాబాద్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. అదే విధంగా ముంబై జట్టు కూడా ఊపుమీదుంది. గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 

ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య 23 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 13 మ్యాచ్‌ల్లో ముంబై గెలవగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌లను పరిశీలిస్తే.. ముంబైదే ఆధిపత్యం కొనసాగింది. ముంబై 3 మ్యాచ్‌ల్లో నెగ్గగా.. హైదరాబాద్ 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

 

ముంబై ఇండియన్స్: రికెల్‌టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్డ్, జస్‌ప్రీత్ బుమ్రా, కర్ణ్‌శర్మ.

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, అనికేత వర్మ, పాట్ కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, జీషాన్ అన్సారీ, మహ్మద్ షమీ, ఎషాన్ మలింగ.

Exit mobile version
Skip to toolbar