Site icon Prime9

MS Dhoni: ఐపీఎల్ లో మొదటి క్రికెటర్ గా ఎంఎస్ ధోని మరో రికార్డు

MS Dhoni

MS Dhoni

MS Dhoni: తీవ్ర ఉత్కంఠ మధ్య.. అత్యంత హోరాహోరీగా సాగింది ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ ను ఊరించిన ఐపీఎల్ 16 ట్రోఫీ చివరికి చెన్నై చెంతకు చేరింది. లాస్ట్ బాల్ వరకు సాగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ తో చెన్నై సూపర్ కింగ్స్ లో లిస్ట్ లో 5 వ ఐపీఎల్ ట్రోఫీ వచ్చి చేరింది.

 

మొదటి ప్లేయర్ గా..(MS Dhoni)

కాగా, చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని మరో ఘనత సొంతం చేసుకున్నాడు. ఇప్పటికి 5 టైటిల్స్ ను గెలుచుకోవడంతో పాటు 250 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన మొదటి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు మ్యాచుల్లో ఎక్కువగా చెన్నై తరపున ఆడిన ధోని.. రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కు ఆడాడు. మరో వైపు ధోని తర్వాత అత్యధిక మ్యాచులు రోహిత్ శర్మ( 243) ఖాతా లో ఉన్నాయి. ఆ తర్వాత దినేశ్ కార్తిక్ (242) ఉన్నాడు. 5 టైటిల్స్ గెలిచన కెఫ్టెన్స్ గా రోహిత్, ధోనీలు సమానంగా ఉన్నారు.

 

కాగా, మొదట గుజరాత్ బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. చెన్నై ఛేదనకు దిగి 0.3 ఓవర్ల లో ఉన్నపుడు వర్షం రావడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. తిరిగి ఆట ప్రారంభం అయ్యాక డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 15 ఓవర్లకు 171 పరుగులకుకుదించారు. చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టంతో లక్ష్యానికి చేరుకుంది. అద్భుత ప్రదర్శనతో సీఎస్కే గెలుపుకు కారణమైన ఓపెనర్ డేవన్ కాన్వేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టెర్నీ అంతా అద్భుతంగా ఆడిన గుజరాత్ ఆటగాడు శుభ్ మన్ గిల్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు దక్కింది.

 

అభిమానుల కోసం మరో సీజన్(MS Dhoni)

ముందు నుంచి ధోనీ రిటైర్మెంట్‌పై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇదే ధోనీకి చివరి సీజన్ అని వార్తలు పుట్టుకొస్తున్న తరుణంలో అభిమానులకు ఓ సూపర్ గుడ్ న్యూస్ చెప్పాడు ధోనీ. మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా.. “ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, నేను పదవీ విరమణ చేయడానికి ఇది సరైన సమయం. కానీ, చెన్నై అభిమానులు నాపై చూపించిన ప్రేమను తీరు, నేను మరో సీజన్ ఆడాలని కోరుకుంటున్నాను. వారికి ఇచ్చే బహుమతి ఇదే. వాళ్లు చూపించిన ప్రేమ, అభిమానం, నేను కూడా వాళ్ల కోసం ఏదైనా చేయాలి. రాబోయే తొమ్మిది నెలలు కష్టపడి తిరిగి ఒక సీజన్ ఆడటం కష్టం. అందుకు నా శరీరం సహకరించాలి. కానీ, అభిమానుల కోసం మరో సీజన్ ఆడతాను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.

Exit mobile version