Site icon Prime9

MI vs PBKS: ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్ గా రోహిత్ శర్మ

MI vs PBKS

MI vs PBKS

MI vs PBKS: ఐపీఎల్ 16 సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 250 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్ గా రోహిత్ రికార్డు సాధించాడు. ఐపీఎల్ 2023 లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 3 సిక్సులు కొట్టిన హిట్ మ్యాన్ ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్ లతో 44 పరుగులు చేశాడు. ఓవరాల్ గా ఈ ఘనత సాధించనా లిస్ట్ లో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (357), ఏబీ డివిలియర్స్ (251), రోహిత్ (250) లతో కొనసాగుతున్నారు. ఇక భారత్ నుంచి రోహిత్ తర్వాత ఎంఎస్ ధోని(235), విరాట్ కోహ్లీ (229) లు ఉన్నారు. ప్రస్తుతం హిట్ మ్యాన్ ఐపీఎల్ లో ఇప్పటి వరకు 233 మ్యాచుల్లో 6,058 పరుగులు చేసి 130.22 స్ట్రైక్ రేట్ తో కొనసాగుతున్నాడు.

 

అర్జున్ ఖాతాలో చెత్త రికార్డు(MI vs PBKS)

మరో వైపు ఈ మ్యాచ్ లో ఓ చెత్త రికార్డు నమోదైంది. సొంత గ్రౌండ్ లో ఓ వికెట్ సాధించిన అర్జున్ టెండూల్కర్ ఖాతా లో ఈ చెత్త ను రికార్డు చేరింది. ఓకే ఓవర్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో ముంబై బౌలర్ గా అవతరించాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 16 వ ఓవర్ వేసిన అర్జున్ 4 ఫోర్లు, 2 సిక్స్ లు , వైడ్, నోబాల్ , సింగిల్ తో కలిపి మొత్తం 31 పరుగులు ఇచ్చాడు. కాగా , 2022 సీజన్ లో ముంబై నుంచి అత్యధికంగా డేనియల్ సామ్స్ కోల్ కతా పై 35 పరుగులు సమర్పించుకున్నాడు. వీరి తర్వాత పవన్ సూయల్ , అల్జారీ జోసెఫ్ , మెక్ క్లాగెన్ 28 పరుగులు ఇచ్చారు.

చివరి బాల్ వరకు పంజాబ్ కింగ్స్ తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి చవి చూసింది. 215 భారీ పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై నిర్ణీత 20
ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్స్ లో కామెరూన్ గ్రీన్ (67), సూర్యకుమార్ యాదవ్ (57) హాప్ సెంచరీలు చేసినా కెప్టెన్ రోహిత్ శర్మ (44) కూడా రాణించినా ఓటమి మాత్రం తప్పలే

 

Exit mobile version