Ind vs Sl: శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో (Ind vs Sl) కోహ్లీ సూపర్ సెంచరీ సాధించాడు. లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తు విరాట్ సెంచరీ కొట్టారు. అంతకు ముందు శుభ్ మన్ గిల్ కూడా సెంచరీ చేయడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది.
నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి భారత్ భారీ స్కోర్ సాధించింది. 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. కోహ్లీ, శుభ్ మన్ గిల్ ఇద్దరు సెంచరీలతో చెలరేగారు.
మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది.
రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ధాటిగా ఆడటంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. రోహిత్ శర్మ ఔటయ్యాక వచ్చిన కోహ్లీ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తు సెంచరీ చేరుకున్నారు. ఫోర్లు, సిక్సర్లతో విరాట్ వీరవిహారం చేశాడు. 13 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇక వన్డేల్లో ఇది కోహ్లీకి 46వ సెంచరీ.. అన్ని మ్యాచుల్లో కలిపి విరాట్ 74 సెంచరీలు పూర్తి చేశాడు.
జయవర్దనే రికార్డ్ బ్రేక్
ఈ సెంచరీతో శ్రీలంక ఆటగాడు జయవర్దనే పేరు మీదు ఉన్న రికార్డును విరాట్Virat Kohliబ్రేక్ చేశాడు.
జయవర్దనే అంతర్జాతీయ కేరిర్లో 448 వన్డే మ్యాచ్ లు ఆడాడు. 33.4 యావరేజీ తో 12,650 పరుగులు చేశాడు మహేల.
అయితే, ఈ రికార్డ్ ను కోహ్లీ దాటేశాడు. కేవలం 266 వన్డేలు ఆడిన కోహ్లీ 57.7 సగటుతో 12,584 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్వదేశంలో చేసిన 20 సెంచరీలను 160 మ్యాచ్ ల్లో చేస్తే.. కోహ్లీ మాత్రం 101 మ్యచ్ ల్లోనే పూర్తి చేశాడు.
విరాట్ ఏకంగా ఈ మ్యాచ్ లో 150.91 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. మ్యాచ్ ప్రారంభం నుంచే కోహ్లీ బ్యాట్ కి పనిచెప్పాడు.
విరాట్ కి ఇది 2023లో రెండవ సెంచరీ. గత నాలుగు వన్డేల్లో కోహ్లీ మూడు సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.
సచిన్ రికార్డుకు చేరువలో కోహ్లీ..
ఈ సెంచరీతో కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డుకు చేరువయ్యాడు.
సచిన్ వన్డే కెరీర్‌లో మొత్తం 49 వన్డే సెంచరీలు చేయగా.. కోహ్లీ వన్డేల్లో 46వ సెంచరీ పూర్తి చేశాడు.
ఇంకో నాలుగు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డను కోహ్లీ బ్రేక్ చేస్తాడు. ఈ 2023 లోనే సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/