Site icon Prime9

KL Rahul: కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం.. అందుకేనా కెప్టెన్సీకి గుడ్ బై!

KL Rahul rejects DC captaincy offer: భారత స్టార్ ప్లేయర్, కీపర్ కేఎల్ రాహుల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేఎల్ రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ఈసారి ఐపీఎల్‌లో సాధారణ ఆటగాడిగానే కొనసాగనున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తను కెప్టెన్సీ బాధ్యతలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ నిపుణులు అంటున్నారు.

 

అయితే కేఎల్ రాహుల్ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. మెగా వేలంలో ఢిల్లీ కేఎల్ రాహుల్ను రూ.14కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. గతంలో లక్నో సూపర్ జెయింట్కు ప్రాతి నిధ్యం వహించిన రాహుల్ మేనేజ్ మెంట్‌తో వచ్చిన విభేదాలతో బయటకు వచ్చే శాడు. జట్టులో కొనసాగేందుకు కూడా నిరాకరించాడు.

 

అలాగే గతంలో అతను పంజాబ్ కింగ్స్ కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్సీ బాధ్యతల కారణంగా తన బ్యాటింగ్ ప్రదర్శన దెబ్బతింటోందని రాహుల్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీమిండియా టీ20 జట్టులో రాహుల్‌కు చోటు లేదు. ఐపీఎల్ సత్తా చాటి భారత జట్టుకు రీఎంట్రీ ఇవ్వా లనే ఆలోచనలో రాహుల్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తనకు కెప్టెన్సీ బాధ్యతలు వద్దని ఢిల్లీ మేనేజ్ మెంట్‌కు రాహుల్ విజ్ఞప్తి చేశాడని సమాచారం. ఇందులో భాగంగానే కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక, కెప్టెన్సీ ఆఫర్‌ను రాహుల్ తిరస్కరించడంతో అక్షర్ పటేల్‌కు తమ సారథిగా ప్రకటించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar