Site icon Prime9

Jasprit Bumrah: బుమ్రా సర్జరీ సక్సెస్.. మైదానంలోకి మరో 6 నెలల తర్వాతే

Jasprit Bumrah

Jasprit Bumrah

Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవల వెన్నునొప్పికి శస్త్రచికిత్స కోసం బుమ్రా న్యూజిలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌‌ , న్యూజిలాండ్ ప్లేయర్ షేన్‌‌ బాండ్‌‌లకు సర్జరీ చేసిన డాక్టర్‌‌ రోవన్‌‌ షౌటెన్‌‌.. బుమ్రాకు చికిత్స అందించాడు. ఈ నేపథ్యంలోనే బుమ్రా వెన్ను నొప్పి శస్త్ర చికిత్స విజయవంతం అయినట్టు సమాచారం.

వన్డే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం(Jasprit Bumrah)

సర్జరీ సక్సెస్‌ అయినా.. బుమ్రా పూర్తిగా కోలుకుని గ్రౌండ్ లోకి అడుగుపెట్టడానికి దాదాపు 6 నెలలు పట్టే అవకాశం ఉన్నటు తెలుస్తోంది. దీంతో బుమ్రా డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసియా కప్ లకు దూరం కానున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించన తర్వాత అక్టోబర్, నవంబర్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం ఉండొచ్చు.

కాగా, గత ఏడాది ఆగస్టులో గాయపడ్డ బుమ్రా అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్ 2022, టీ 20 వరల్డ్ కప్ లతో పాటు తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి కీలక టోర్నీలకు బుమ్రా దూరంగా ఉన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీకి కూడా బుమ్రా అందుబాటులో ఉండటం లేదు.

ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ

మరో వైపు బుమ్రా(Jasprit Bumrah) దూరమవడం ముంబై ఇండియన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ. సర్జరీ కంప్లీట్ అయినా.. కనీసం 24 వారాల పాటు బుమ్రా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.జ అయితే స్వదేశంలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్‌కు బుమ్రా అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ పేర్కొంది.

 

Exit mobile version