Site icon Prime9

SRH vs GT : ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి విక్టరీ కొట్టిన గుజరాత్.. ఇక ఇంటి బాట పట్టిన హైదరాబాద్

SRH vs GT match highlights in ipl 2023

SRH vs GT match highlights in ipl 2023

SRH vs GT : ఐపీఎల్ 2023 లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజ‌రాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శన తో అదరగొట్టిన గుజరాత్ సూపర్ విక్టరీ సాధించింది. సొంత గ‌డ్డ‌పై స‌న్‌రైజ‌ర్స్ పై 34 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. 189 పరుగుల టార్గెట్ ని చేధించే క్రమంలో స‌న్ రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 154 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. దీంతో గుజరాత్ ప్లేఆఫ్స్ బెర్తుని ఖాయం చేసుకుంది. సీజన్‌లో 13వ మ్యాచ్ ఆడిన గుజరాత్‌కి ఇది 9వ విజయం కాగా 18 పాయింట్లతో పట్టికలో నెం.1 స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. మరోవైపు 12వ మ్యాచ్ ఆడిన హైదరాబాద్ టీమ్ 8వ ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది.

టార్గెట్ ని చేధించే క్రమంలో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్లు పూర్తిగా చేతులెత్తేశారు. హెన్రిచ్ క్లాసెన్ (64; 44 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) ఒక్క‌డే అర్ద‌శ‌త‌కంతో రాణించ‌గా భువ‌నేశ్వ‌ర్ కుమార్‌(27) ఫ‌ర్వాలేద‌నిపించాడు. ఇక మిగిలిన బ్యాట్స్ మెన్లు అంతా ఒకరి తర్వాత మరొకరం అనే విధంగా పెవిలియన్ బాట పట్టారు. అన్మోల్‌ప్రీత్ సింగ్ (5), అభిషేక్ శ‌ర్మ‌(4), రాహుల్ త్రిపాఠి(1), కెప్టెన్ మార్‌క్ర‌మ్‌(10), అబ్దుల్ స‌మ‌ద్‌(4)లు సింగిల్ డీజిల్ స్కోర్లకే పరిమితం అయ్యి ఘోరంగా విఫ‌లం అయ్యారు. దాంతో 9వ ఓవర్లు ముగిసే సమయానికి 59/7తో నిలిచిన హైదరాబాద్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ మిడిల్ ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్ ఒంటరి పోరాటానికి.. భువనేశ్వర్ కుమార్ సపోర్ట్ ఇవ్వడంతో మ్యాచ్‌ని గెలిపించేందుకు బాగా ట్రై చేసిన కానీ.. ఓటమి పాలయ్యారు. చివర్లో మయాంక్ మార్కండే కూడా 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 18 పరుగులు చేశాడు. గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ, మోహిత్ శ‌ర్మ చెరో నాలుగు వికెట్లు తీయ‌గా, య‌శ్ ద‌యాల్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ కు మొద‌టి ఓవ‌ర్‌లోనే భువ‌నేశ్వ‌ర్ కుమార్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఓపెన‌ర్ వృద్ధిమాన్ సాహా(0) ను డ‌కౌట్ చేశాడు. దీంతో ప‌రుగుల ఖాతా తెర‌వ‌క ముందే గుజ‌రాత్ మొద‌టి వికెట్ కోల్పోయింది. శుభ్ మ‌న్ గిల్‌(101; 58 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌) ఐపీఎల్‌లో త‌న తొలి శ‌త‌కాన్ని సాధించాడు. అతనికి సపోర్ట్ గా సాయి సుద‌ర్శ‌న్‌ (47; 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా రాణించాడు. ఓ వైపు గిల్ దూకుడు కొన‌సాగించ‌గా, మ‌రో వైపు సాయి సుద‌ర్శ‌న్ చ‌క్క‌ని స‌హ‌కారం అందించాడు. శుభ్‌మ‌న్ ధాటిగా ఆడ‌డంతో స్కోరు బోర్డు ప‌రుగులు పెట్టింది. ఈ క్ర‌మంలో గిల్ 22 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేశాడు. హాప్ సెంచ‌రీ త‌రువాత గిల్ మ‌రింత వేగం పెంచాడు. అయితే.. సాయి సుద‌ర్శ‌న్‌ను పెవిలియ‌న్‌కు చేర్చి ప్ర‌మాద‌క‌రంగా మారిన వీరి జోడిని మార్కో జాన్సెస్ విడ‌దీశాడు. దీంతో 147 ప‌రుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర‌ప‌డింది. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అయ్యారు. హార్ధిక్ పాండ్యా(8), డేవిడ్ మిల్ల‌ర్‌(7), రాహుల్ తెవాటియా(3)లు విప‌లం అయ్యారు.

చివ‌రి ఓవ‌ర్‌ వేసిన భువ‌నేశ్వ‌ర్ కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొద‌టి బంతికి స‌మ‌ద్‌కు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్‌ గిల్ ఔట్ కాగా, రెండో బంతికి ర‌షీద్ ఖాన్(0) వికెట్‌ కీప‌ర్ క్లాసెన్ చేతికి చిక్కాడు. మూడో బంతికి నూర్ అహ్మ‌ద్‌(0) ర‌నౌట్ అయ్యాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ కు హ్యాట్రిక్ మిస్ అయినా టీమ్ హ్యాట్రిక్ వ‌చ్చింది. ఐదో బంతికి మ‌హ్మ‌ద్ ష‌మీ(0) మార్కో జాన్స‌న్ చేతికి చిక్కాడు. దీంతో భువ‌నేశ్వ‌ర్ ఖాతాలో ఐదు వికెట్లు ప‌డ్డాయి.  స‌న్ రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఐదు వికెట్లు తీయ‌గా, మార్కో జాన్సెన్, ఫరూఖీ, న‌ట‌రాజ‌న్‌లు ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

Exit mobile version