Prime9

IPL 2025 Final : టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. మొదట బ్యాటింగ్ ఎవరంటే?..

IPL 2025 Final : ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య కాసేపట్లో మొదలు కానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ జట్టు మొదట బ్యాటింగ్ చేయనున్నది. అయితే ఇరు జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోకపోవడం విశేషం. ఫైనల్ మ్యాచ్ ఇరుజట్లకు 18 ఏళ్ల టైటిల్ కలను సాకారం చేసే అవకాశం వచ్చింది. దీంతో టాస్ మ్యాచ్ ఫలితంపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.

 

టాస్ ప్రాముఖ్యత..
ఈ సీజన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన ఎనిమిది మ్యాచ్‌‌ల్లో ఆరు సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. స్కోరు సెట్ చేసే జట్టుకు స్వల్ప ప్రయోజనాన్ని సూచిస్తుంది. టాస్ గెలిచిన జట్టు ఏడు సార్లు ఛేజింగ్ ఎంచుకుంది. ఎందుకంటే ఈ మైదానంలో భారీ లక్ష్యాలను అంచనా వేయడం కష్టం. గణాంకాలు టాస్ విషయంలో కీలకంగా ఉంటాయి. కానీ, అది ఫలితాన్ని పూర్తిగా నిర్ణయించదు.

 

పంజాబ్ జట్టు : ప్రియాన్ష్ ఆర్య, ఇంగ్లిస్, శ్రేయస్ అయ్యర్, వధేరా, శశాంక్ సింగ్, స్టాయినిస్, అజ్మతుల్లా, జెబీసన్, విజయ్ కుమార్, అర్ష్‌దీప్, యేజ్వేంద్ర ఉన్నారు.

 

ఆర్సీబీ జట్టు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్, పాటిదార్, లివింగ్‌స్టన్, జితేశ్, షేపర్డ్, కృనాల్ పాండే, భవనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హేజిల్‌వుడ్ ఉన్నారు.

Exit mobile version
Skip to toolbar