DC vs MI : ఐపీఎల్ 2023లో ఈరోజు (ఏప్రిల్ 11, మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో ఇంతవరకు ఈ జట్లు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయక పోవడం గమనార్హం. దీంతో ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ తొలి విజయం దక్కించుకోవాలని సిద్దంగా ఉన్నాయి. కాగా టాస్ గెలిచిన ముంబై టీమ్ బౌలింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ జట్టు బ్యాటింగ్ చేయనుంది.
173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు తమదైన శైలిలో విజృంభిస్తూ పరుగుల వరద పారిస్తున్నారు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసే సమయానికి రోహిత్ 37 , ఇషాన్ 30 పరుగులతో ఉన్నారు. ముంబై ప్రస్తుత స్కోర్ 68/0
19.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైన ఢిల్లీ క్యాపిటల్స్. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి బోణి ఎవరు కొడతారో చూడాలి..
బేరణ్ డార్స్ వేసిన 19 వ ఓవర్ లో సమయానికి హాఫ్ సెంచరీ బాదిన అక్షర్.. బౌండరీ బాదే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇదే ఓవర్లో వార్నర్ కూదా క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన వెంటనే కుల్దీప్ రన్ ఔట్ అయ్యి ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యాడు. ఇక పౌరెల్ కూడా క్యాచ్ ఇచ్చి వికెట్ కోల్పోయాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ ఢిల్లీకి అండగా నిలబడ్డారు. గ్రీన్ వేసిన 16 ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టిన అక్షర్.. జేసన్ బెహ్రన్‌డార్ఫ్ వేసిన 17వ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదాడు. 18 వ ఓవర్లో కూడా సిక్స్ బాదాడు. అక్షర్ దంచికొడుతుండడంతో ఢిల్లీ కోలుకుంది. 18 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 165/5. డేవిడ్ వార్నర్ 51, అక్షర్‌పటేల్ 54 పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ గా 26 పరుగులు చేసిన మనీశ్ పాండే.. జేసన్ బెహ్రన్‌డార్ఫ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు.. మూడో వికెట్ గా అరంగ్రేట ఆటగాడు యశ్‌దుల్(2)ను రిలే మెరిడిత్ పెవిలియన్‌కు పంపించాడు.. 10.4 ఓవర్‌కు రోవ్‌మన్ పావెల్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు.. 13 వ ఓవర్ మూడో బంతికి లలిత్ యాదవ్ ను చావ్లా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఢిల్లీ జట్టు సగం వికెట్లను కోల్పోయింది.13 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 103/5. డేవిడ్ వార్నర్ 46, అక్షర్‌పటేల్ 1 పరుగుతో ఉన్నారు.
ఈ సీజన్‌లో పేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు పృథ్వీ షా(15). మూడు ఫోర్లు బాది టచ్‌లో ఉన్నట్లు కనిపించిన షా.. హృతిక్ షోకీన్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 34/1.
టాస్ ఓడడంతో ఢిల్లీ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. డేవిడ్ వార్నర్ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కామెరూన్ గ్రీన్ వేసిన మూడో ఓవర్‌లోని ఆఖరి రెండు బంతులను వార్నర్ ఫోర్లుగా మలిచాడు. ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 29/0. డేవిడ్ వార్నర్ 17, పృథ్వీ షా 11 పరుగులతో ఉన్నారు.
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, రిలే మెరెడిత్
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, యశ్ ధుల్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ముస్తాఫిజుర్ రెహమాన్