KKR vs PBKS : పంజాబ్ ని ఓడించిన కోల్‌క‌తా.. ప్లే ఆఫ్స్ రేసులో నైట్ రైడర్స్

ఐపీఎల్ 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌ తో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌ రైడ‌ర్స్ సూపర్ విక్టరీ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్నికోల్‌క‌తా నైట్ రైడర్స్ ఐదు వికెట్లు కోల్పోయి ఆఖ‌రి బంతి వరకు ఉత్కంఠ రేపి అనూహ్య విజయం సాధించింది. ఈ సీజన్ ఏమంటూ స్టార్ట్ చేశారో కానీ ప్రతి

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 09:05 AM IST

KKR vs PBKS : ఐపీఎల్ 2023లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌ తో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌ రైడ‌ర్స్ సూపర్ విక్టరీ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్నికోల్‌క‌తా నైట్ రైడర్స్ ఐదు వికెట్లు కోల్పోయి ఆఖ‌రి బంతి వరకు ఉత్కంఠ రేపి అనూహ్య విజయం సాధించింది. ఈ సీజన్ ఏమంటూ స్టార్ట్ చేశారో కానీ ప్రతి మ్యాచ్ నరాలు కట్ అయ్యే రేంజ్ లో అందర్నీ కంగారూ పెడుతూ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతూ.. ఎవరు గెలుస్తారో చెప్పలేకపోతున్నారు. చివరి బంతి వరకు సస్పెన్స్ థ్రిల్లర్ లాగా సాగుతూ ఆడియన్స్ అందరికీ హై ఫీస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. చివరి బంతి వరకు ఆసక్తిగా సాగిన మ్యాచ్ లో కోల్‌క‌తా గెలుపొందింది.

పంజాబ్ ఇచ్చిన 180 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో ఓపెనర్లు జేసన్ రాయ్ (38: 24 బంతుల్లో 8×4), రహ్మతుల్లా (15: 12 బంతుల్లో 1×4, 1×6) దూకుడుగా ఆడి మంచి ఆరంభాన్ని ఇచ్చారు.  ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ నితీశ్ రాణా (51: 38 బంతుల్లో 6×4, 1×6) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.  సమయోచితంగా ఆడుతూ జట్టుని గెలుపు దిశగా నడిపించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇక చివర్లో ఆండ్రీ రసెల్ (42: 23 బంతుల్లో 3×4, 3×6) భారీ షాట్లతో చెలరేగిపోయాడు. రసెల్ కి తోడుగా రింకూ సింగ్‌ ( 21 నాటౌట్‌; 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా ధాటిగా ఆడ‌డంతో 6 వికెట్ల తేడాతో కోల్‌క‌తా గెలుపొందింది.

ముఖ్యంగా చివరి 12 బంతుల్లో 26 పరుగులు అవసరమైన దశలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన శామ్ కరన్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన ఆండ్రీ రసెల్ మొత్తం 20 పరుగులు రాబట్టేశాడు. 20వ ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ మొద‌టి బంతికి ప‌రుగులు ఏమీ ఇవ్వ‌లేదు. రెండో బంతికి ర‌స్సెల్‌, మూడో బంతికి రింకూ సింగ్‌లు సింగిల్స్ తీశారు. నాలుగో బంతికి ర‌స్సెల్ రెండు ప‌రుగులు తీయ‌గా, ఐదో బంతికి ర‌స్సెల్ ర‌నౌట్ అయ్యాడు. దీంతో ఆఖ‌రి బంతికి రెండు ప‌రుగులు అవ‌స‌రం కాగా.. రింకూ సింగ్ ఫోర్ కొట్టి కోల్‌క‌తా కి మరో విజయం అందించాడు.

 

అంత‌క‌ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 179 ప‌రుగులు చేసింది. శిఖ‌ర్ ధావ‌న్‌ (57; 47 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ‌ శ‌త‌కంతో రాణించ‌గా జితేశ్ శ‌ర్మ‌(21; 18 బంతుల్లో 2 సిక్స‌ర్లు) ప‌ర్వాలేద‌నిపించాడు. భానుకా రాజ‌ప‌క్స(0), లివింగ్ స్టోన్‌(15), సామ్ క‌ర‌న్‌(4)లు విఫ‌లం కాగా. ఆఖ‌ర్లో షారుక్ ఖాన్(21 నాటౌట్‌; 8 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), హర్‌ప్రీత్ బ్రార్( 17 నాటౌట్; 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడ‌డంతో పంజాబ్ మంచి స్కోరు సాధించింది. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మూడు, హర్షిత్ రాణా రెండు వికెట్లు తీయ‌గా సుయాష్ శర్మ, నితీశ్ రాణా ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు. సీజన్‌లో 11వ మ్యాచ్ ఆడిన కోల్‌కతాకి ఇది ఐదో విజయం కాగా.. పంజాబ్ కింగ్స్‌కి ఇది ఆరో ఓటమి. ఈ మ్యాచ్‌లో గెలవడంతో కోల్‌కతా టీమ్ ప్లేఆఫ్ అవకాశాల్ని సజీవంగా ఉంచుకుంది.