IPL 2023 : ఐపీఎల్ 2023 మినీ వేలం కొచ్చిలో జరుగుతుంది. టెస్ట్ ఆడే దేశాలతో పాటు నాలుగు అసోసియేట్ దేశాలు కూడా వేలంలో ఉన్నాయి. అసోసియేట్ దేశాల నుంచి 119 మంది క్యాప్డ్ ప్లేయర్‌లు, 282 అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లు, 4గురు ప్లేయర్‌లు వేలం బరిలో నిలిచారు. ఈ వేలంలో మొత్తంగా 405 మంది ఆటగాళ్లపై బెట్టింగ్‌లు జరగనున్నాయి. బెన్ స్టోక్స్, సామ్ కరన్ సహా పలువురు ఆటగాళ్లపై ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అదే విధంగా ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్స్‌లో ఎక్కువ డబ్బు ఉండగా… పంజాబ్ కింగ్స్ తర్వాత స్థానంలో ఉంది.
ఏ ఐపీఎల్ జట్టు వద్ద ఎంత డబ్బు మిగిలి ఉందంటే…
సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 42.25 కోట్లు
పంజాబ్ కింగ్స్ రూ. 32.2 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్ రూ.23.35 కోట్లు
ముంబై ఇండియన్స్ రూ. 20.55 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ 20.45 కోట్లు
గుజరాత్ టైటాన్స్ రూ.19.25 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ రూ.19.45 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ రూ. 13.2 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 8.75 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 7.05 కోట్లు
ఏ జట్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే…
సన్‌రైజర్స్ హైదరాబాద్ – 13
కోల్‌కతా నైట్ రైడర్స్ – 11
లక్నో సూపర్ జెయింట్స్ – 10
రాజస్థాన్ రాయల్స్ – 9
పంజాబ్ కింగ్స్-9
ముంబై ఇండియన్స్ – 9
చెన్నై సూపర్ కింగ్స్ – 7
గుజరాత్ టైటాన్స్ – 7
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 7
ఢిల్లీ క్యాపిటల్స్ – 5
ఐపీఎల్ 2019లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్‌ను తొలిసారిగా పంజాబ్ కింగ్స్ రూ.7.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2020లో విడుదలయ్యాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది గాయం కారణంగా మెగా వేలంలో పాల్గొనలేదు. కాగా ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సామ్ కరన్ టి 20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్‌గా కూడా నిలిచాడు. దీంతో ఈ మినీ వేలంలో అందరి చూపు తన మీద పడింది. బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన కర్రన్‌ను రూ. 18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. గతంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా దక్షిణాఫ్రికాకు చెందిన క్రిస్ మోరిస్ పేరిట రికార్డు ఉంది.
అలాగే ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ కోసం మూడు ఫ్రాంచైజీలు పోరాడాయి కానీ ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ గెలిచింది. ఏకంగా రూ.17.50 కోట్లకు గ్రీన్‌ను కొనుగోలు చేసి జట్టుకు మరింత బలాన్ని తీసుకొచ్చింది. బెన్ స్టోక్స్ కోసం హైదరాబాద్, లక్నో, చెన్నై ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలబడ్డాయి. చివరికి రూ. 16.25 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.