CSK vs GT Final Match : ఐపీఎల్ 2023 ముగింపునకు చేరువయ్యింది. చిట్ట చివరి ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. మరికాసేపట్లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. మరి ఈ మ్యాచ్ లో విజయం సాధించి కెప్టెన్ ధోనీ ఐపీఎల్ కి వీడ్కోలు పలుకుతారు అని రూమర్స్ బలంగా వినిపిస్తుండగా.. ఇప్పటికే చెన్నై బ్యాట్స్ మెన్, మన తెలుగు ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించి.. అత్యధిక టైటిల్స్ సాధించిన ముంబై ఇండియన్స్ రికార్డును చెన్నై సమం చేస్తుందా.. లేదా వరుసగా రెండో సీజన్ లోనూ గుజరాత్ విజేతగా నిలుస్తుందా అని అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే వర్షం కారణంగా ఇంకా టాస్ ఇంకా వేయకపోవడం గమనార్హం. కాగా ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా నిర్వహించడం కుదరకపోతే గత సీజన్‌లో రిజర్వ్ డేకు అవకాశమిచ్చారు. కాగా అదే సీన్ రిపీట్ అవుతుంది కాబట్టి ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ కు కూడా రిజర్వ్ డేకు ఛాన్స్ ఉందనే చెప్పాలి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే పరిస్థితులు ఏర్పడితే కనీసం ఇరు వైపులా ఐదు ఓవర్లను నిర్వహించవచ్చు. అది సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ కూడా నిర్వహించవచ్చు. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే స్థితికి వస్తే మాత్రం.. అప్పుడే లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్న జట్టును విజేతగా ప్రకటిస్తారు.