CSK vs GT Final: ఐపీఎల్ 2023లో భాగంగా ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన చెన్నై మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటి ఇన్నింగ్స్ పూర్తయ్యే సరికి గుజరాత్ టీం నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 రన్స్ చేసింది. 3 వికెట్ పై ఆడిన సాయి సుదర్శన్ సూపర్ ఇన్నింగ్స్ బాదాడు. 46 బంతుల్లో 96 పరుగులు చేశాడు. అందులో 6 సిక్సులు, 8 ఫోర్లు ఉన్నాయి. వృద్ధిమాన్ సాహా సైతం హాఫ్ సెంచరీ(54) పూర్తి చేశాడు. మిగిలిన బ్యాటర్లైన గిల్ 39, హార్ధిక్ పాండ్యా 21 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లు పతిరణ రెండు వికెట్లు తీయగా, చాహర్, జడేజా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది. సీఎస్కే మ్యాచ్ గెలిచి తన ఖాతాలో ఐదోసారి కప్ కొట్టి ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న అత్యధిక టైటిళ్ల రికార్డును సమం చేస్తుందా లేదా గతేడాది ఐపీఎల్ విన్నర్ గా నిలిచిన గుజరాత్ జట్టు వరుసగా రెండో సారి కూడా టైటిల్ అందుకుంటుందా..? అనేది వేచి చూడాలి.