IPL Arjun Tendulkar: ఐపీఎల్ లో తొలి వికెట్ తీసిన జూనియర్ టెండూల్కర్.. వీడియో వైరల్

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అర్జున్ ను 2021 లోనే బేసే ఫ్రైస్ కు కొనుగోలు చేసింది. అయితే, అప్పటి నుంచి తుది జట్టులో అవకాశం రాలేదు.

IPL Arjun Tendulkar: ఐపీఎల్ 16 సీజన్ లో ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన పోరుతో వరుసగా మూడో విజయాన్ని సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులతో లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ సన్ రైజర్స్ 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్‌ అవ్వడంతో ముంబై14 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ బ్యాటర్స్ లో మయాంక్ అగర్వాల్(48), హెన్రిచ్ క్లాసెన్ (36), మార్క్రమ్ (22) తప్ప మిగిలిన ఎవరూ పెద్దగా పరుగులు చేయలేదు. మరో వైపు ముంబై బౌలర్లలో బెహ్రన్ డార్ఫ్, రిలె మెరిడిత్ , పీయూష్ చావ్లా లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. కామెరూన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

 

రెండో మ్యాచ్ తోనే అద్భుత ప్రదర్శన(IPL Arjun Tendulkar)

కాగా, సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బౌలర్, సచిన్ తనయుడు అర్జున్జ టెండూల్కర్ తొలి ఐపీఎల్ వికెట్ ను సాధించాడు. హైదరబాద్ లో ఆటగాడు భువనేశ్వర్ కుమార్ ను ఔట్ చేసి తన ఐపీఎల్ కెరీర్ లో మొదటి వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా ఓవర్ రాల్ ఈ మ్యాచ్ లో అర్జున్ మంచి ప్రదర్శన కనిపించాడు. హైదరాబాద్ మ్యాచ్ లో 2.5 ఓవర్లు వేసిన అర్జున్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఎస్ఆర్ హెచ్ విజయం సాధించాలంటే చివరి ఓవర్ కు 20 పరుగులు అవసరం అయ్యాయి. ఆ సమయంలో ముంబై సారథి రోహిత్.. అర్జున్ నమ్మి బంతి అందించాడు. రోహిత్ నమ్మకాన్ని నిలబెడుతూ భువనేశ్వర్ వికెట్ తీయడంతో సన్ రైజర్స్ ఆలౌట్ అయింది. ఈ ఓవర్ లో అర్జున్ మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక ఐపీఎల్ 16 సీజన్ తో అర్జున్ అరంగేట్రం చేశాడు. ఆడిన రెండో మ్యాచ్ లోనే మంచి ప్రదర్శన కనబరుస్తుండటంతో అందరి ప్రశంసలు అందుకున్నాడు.

 

 

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అర్జున్ ను 2021 లోనే బేసే ఫ్రైస్ కు కొనుగోలు చేసింది. అయితే, అప్పటి నుంచి తుది జట్టులో అవకాశం రాలేదు. గత ఏడాది జరిగిన మినీ వేలంలో అర్జున్ ను ముంబై మళ్లీ కొనుగోలు చేసింది. ఎట్టకేలకు ఐపీఎల్ 16 సీజన్ లో ఆడేందుకు అర్జున్ కు అవకాశం వచ్చింది. ఆల్ రౌండర్ అయిన అర్జున్ గత ఏడాది దేశవాళీ క్రికెట్ లో గోవా జట్టు తరపున రంజీల్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు, 7 లిస్ట్ ఏ మ్యాచులు, 9 టీ20 లు ఆడాడు.