Site icon Prime9

IPL 2025 schedule: ఐపీఎల్ షెడ్యూల్.. హైదరాబాద్ మ్యాచ్‌లు ఎప్పుడంటే?

IPL 2025 schedule Dates, venues, timings of all matches: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఐపీఎల్ -2025 షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ 18వ సీజన్.. మార్చి 22వ తేదీన ప్రారంభమై .. మే 25న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. సుమారు 65 రోజుల పాటు మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. తొలి మ్యాచ్ కేకేఆర్, ఆర్సీబీ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఉండగా.. 13 వేదికల్లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.

మొత్తం 10 జట్లు కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్, ఆర్‌సీబీ, సీఎస్‌కే, ముంబై ఇండియన్స్, పీబీకేఎస్, జీటీ, ఎల్ఎస్‌జీ, ఆర్ఆర్ ఉన్నాయి. ఐపీఎల్ తొలి మ్యాచ్ మార్చి 22వ తేదీన కోల్‌కతాలో ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ స్టేజ్‌లో 14మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో హైదరాబాద్‌లోనే 7 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ 23వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో హైదరాబాద్‌లోనే తలపడనుంది.

ఐపీఎల్ 2025లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 11 మ్యాచ్‌లు జరగుతున్నాయి. హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు జరుగుతుండగా.. లీగ్ స్టేజ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్‌లతో పాటు క్వాలిఫైయర్-1, ఎలిమినేటర్ కూడా హైదరాబాద్‌లో జరగనున్నాయి. అయితే ఇందులో ఢిల్లీ జట్టు రెండో హోం వెన్యూగా విశాఖపట్నం ఎంచుకుంది. దీంతో మార్చి 24వ తేదీన లక్నో వర్సెస్ ఢిల్లీ, 30వ తేదీన ఢిల్లీ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి.

అయితే, ఐపీఎల్ 2025లో కీలక మ్యాచ్‌లకు హైదరాబాద్, కోల్‌కతా వేదికలు కానున్నాయి. మే 20వ తేదీన క్వాలిఫయర్, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగుతుండగా.. మే 23వ తేదీన క్వాలిఫయర్-2, మే 25వ తేదీన కోల్‌కతాలో నిర్వహిస్తున్నారు. కాగా, క్వాలిఫయర్-1లో గెలిచిన టీం నేరుగా ఫైనల్ చేరుతోంది. ఇందులో ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఈ జట్టు ఎలిమినేటర్‌లో గెలిచిన క్వాలిఫయర్-2లో తలపడాల్సి ఉంటుంది.

Exit mobile version
Skip to toolbar