Ind vs SL: గువాహతి వేదికగా.. శ్రీలంకతో జరగుతున్న మెదటి మ్యాచ్ లో కోహ్లి సూపర్ సెంచరీ సాధించాడు. ఇక భారత్ కు (Ind vs SL) ఓపెనర్లు శుభారంభం అందించారు. ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, (Rohit sharma) శుభ్ మన్ గిల్ (Shubman gill) ఇద్దరు రాణించారు. శుభ్ మన్ గిల్ వికెట్ పడినా కాసేపటికే.. రోహిత్ శర్మ కూడా ఔటయ్యాడు. ఇక వన్ డౌన్ లో వచ్చిన కోహ్లి తన బ్యాటింగ్ శైలితో సెంచరీ సాధించాడు.
ఓపెనర్ల శుభారంభం
భారత్ ఓపెనర్లు మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించడంతో భారత్ మంచి స్కోర్ సాధించింది. టీమిండియా వికెట్లు తీయడానికి శ్రీలంక బౌలర్లు శ్రమించిన ఫలితం లేకుండాపోయింది.
శ్రీలంకతో టి20 సిరీస్ కి దూరమైన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో రాణించాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అర్ధ సెంచరీ సాధించాడు. ఇక శుభ్ మన్ గిల్ సైతం 70 పరుగులతో రాణించాడు.
ఇక ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లి మరో సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ నిర్ణీత ఓవర్లకు 3 73 పరుగులు చేసింది.
చివర్లో స్కోర్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నా.. అక్సర్ పటేల్ హర్ధిక్ పాండ్యా తమ ప్రభావాన్ని చూపించలేకపోయారు. దింతో స్కోర్ కాస్త తగ్గిందనే చెప్పాలి.
ప్రభావం చూపని లంక బౌలర్లు
ఇక శ్రీలంక బౌలర్ల విషయానికి వస్తే.. వాహిందు హసరంగా, దిల్షాన్ మధుశంఖ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దసున్ శనక ఓ వికెట్ తీసుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
బిగ్ సర్‌ప్రైజ్.. ఆస్కార్‌కు క్వాలిఫై అయిన “కాంతారా”
ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలి.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
తక్కువ ధరలో మహీంద్రా థార్ సరికొత్త వేరియంట్ లాంచ్.. ఫీచర్స్ ఇవే..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital