Site icon Prime9

India won by 142 Runs: సిరీస్ క్లీన్ స్వీప్.. టీమిండియా ఘన విజయం

India Won by 142 Runs against England in 3rd ODI: ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆఖరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా 142 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది.

శుభ్‌మన్ గిల్(102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు; 112) సెంచరీతో దూకుడుగా ఆడాడు. ఒపెనర్ రోహిత్ శర్మ(1) విఫలమైనా.. విరాట్ కోహ్లీ(55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్; 52), శ్రేయస్ అయ్యర్(64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు;78) హఫ్ సెంచరీలతో రాణించాడు. రాహుల్(29 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్;40), హార్దిక్(17), అక్షర్(13), హర్షిత్(13). అర్ష్ దీప్(2), కుల్‌దీప్(1) పరుగులు చేశారు. అయితే తొలుత 400 స్కోరు అవుతుందని అనుకున్నా.. చివరిలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 356 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్ 4 వికెట్ల పడగొట్టగా.. మార్క్ వుడ్ రెండు వికెట్లు, సికిబ్ మహమూద్, అట్కిన్సన్ రూట్ తలో వికెట్ తీశారు.

భారత్ విధించిన 357 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 214 పరుగులకే కుప్పకూలింది. భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని అందించారు. ఓపెనర్ల దూకుడైన బ్యాటింగ్‌తో తొలి 6 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 60 పరుగులు చేసింది. అర్ష్ దీప్ వరుస ఓవర్లలో బెన్ డకెట్(34), ఫిల్ సాల్ట్(23) పెవిలియన్ చేర్చడంతో 60 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన టామ్(38), జోరూట్(24) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. భారీ షాట్లతో భారత బౌలర్లను భయపెట్టించారు. కానీ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో టామ్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జోరూట్ క్లీన్ బౌల్డ్ కావడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది.

తర్వాత హ్యారీ బ్రూక్(19), జోస్ బట్లర్‌(6)లను వరుసగా ఓవర్లలో హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ 161 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. లివింగ్ స్టోన్(9) సుందర్ బౌలింగ్‌లో ఔట్ అవ్వగా.. ఆదిల్ రషీద్(0), మార్క్ వుడ్(9)లను హార్దిక్ పాండ్య పెవిలియన్ చేర్చాడు. చివరిలో అట్కిన్సన్(38) ఒంటరి పోరాటం చేశాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అట్కిన్సన్ బౌల్డ్ కావడంతో ఇంగ్లాండ్ 214 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్, హర్షిత్, అక్షర్, హార్దిక్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సుందర్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.

Exit mobile version
Skip to toolbar