India Vs England 3rd ODI – England Target is 357 Runs: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దంచికొట్టారు. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(1) నిరాశ పర్చిన మిగతా బ్యాటర్లు ఆకట్టుకున్నారు.
భారత బ్యాటర్లలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(112, 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ(52, 55 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్), శ్రేయస్ అయ్యర్(78, 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కేఎల్ రాహుల్(40, 29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్) రాణించగా.. హార్దిక్ పాండ్యా(17, 9 బంతుల్లో 2 సిక్స్‌లు), అక్షర్ పటేల్(13, 12 బంతుల్లో 2 ఫోర్లు) పర్వాలేదనిపించారు. చివరిలో హర్షిత్ రాణా(13, 10 బంతుల్లో ఫోర్, సిక్స్), అర్ష్ దీప్(2), కుల్‌దీప్(1) పరుగులు చేశారు. దీంతో భారత్.. 50 ఓవర్లకు 356 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో రషీద్ 4 వికెట్లు పడగొట్టగా.. మార్క్ వుడ్ 2, సకీద్ మహ్మద్, ఆట్కి న్సన్, జో రూట్ తలో వికెట్ తీశారు..