INDIA: విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఘోర వైఫల్యం చెందింది. దీంతో రెండో వన్డేలో ఆసీస్ ఘన విజయాన్ని అందుకుంది.
11 ఓవర్లలోనే ముగించారు (INDIA)
రెండో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్లు విశ్వరూపం ప్రదర్శించారు. 117 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోనే ముగించారు. దీంతో సీరిస్ సమమైంది. అంతకముందు.. ఆస్ట్రేలియా పేస్ ధాటికి సగం ఓవర్లు ఆడేందుకూ టీమిండియా కష్టపడింది. అదే పిచ్ పై ఆసీస్ విశ్వరూపం చూపించింది. రోహిత్ సేన విధించిన 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం 11 ఓవర్లలోనే ఛేదించింది. సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగుతూ వికెట్ పడకుండా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (51*), మార్ష్ (66*) పని పూర్తి చేశారు. ఈ విజయంతో ఆసీస్ 1-1తో సిరీస్‌ను సమం చేసి టైటిల్ రేసులో నిలిచింది. ఇక చెన్నై వేదికగా జరిగే చివరిదైన మూడో మ్యాచ్ సిరీస్ విజేతను తేల్చనుంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 117 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, ఎల్లీస్ పేస్ అటాక్ ముందు భారత బ్యాటింగ్ ఆర్డర్ వెలవెలబోయింది.
విరాట్ కోహ్లీ (31), అక్షర్ పటేల్ (29) ఆ కాస్త రాణించడంతో.. భారత్ స్కోరు వంద పరుగులైనా దాటగలిగింది.
శుబ్‌మన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ డకౌట్లు కాగా.. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5 వికెట్లతో విజృంభించగా.. సీన్ అబాట్ 3, ఎల్లీస్ 2 వికెట్లు పడగొట్టాడు.
గిల్, సూర్య డకౌట్..
ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే టీమిండియాకు షాక్ తగిలింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గిల్ డకౌట్ అయ్యాడు. లబుషేన్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
13 పరుగులు చేసిన రోహిత్ శర్మ స్టార్క్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వెంటనే సూర్య కుమార్ కూడా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు.
వీరితో పాటు.. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ డకౌట్ గా వెనుదిరిగారు. చివర్లో అక్షర్ పటేల్ 29 పరుగులతో రాణించాడు.
కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఘోరంగా విఫలం అయ్యారు.