Ind vs Aus 2nd Test: దిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్ విధించిన 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఈ సీరిస్ లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అశ్విన్, అక్షర్ రాణించడంతో.. భారత్ సునాయస విజయాన్ని అందుకుంది. మెుదట భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులకే కంగారు జట్టు చాప చుట్టేసింది. మరో 6 వికెట్లు ఉండగానే టీమిండియా విజయాన్ని అందుకుంది.
కుప్పకూలిన ఆసీస్ బ్యాటింగ్.. (Ind vs Aus 2nd Test)
రెండో రోజు ఇన్నింగ్స్ లో మంచి స్థితిలో నిలిచిన ఆసీస్.. మూడో రోజు మాత్రం కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్స్ బెంబేలెత్తిపోయారు. ఆసీస్ ఇన్నింగ్స్ లో హెడె, లబుష్ చెంజ్ మినహా ఓ ఒక్కరు రెండెంకల స్కోరు చేయలేకపోయారు. ఇందులో ముగ్గురు డకౌట్ గా వెనుదిరిగారు. రవీంద్ర జడేజా బౌలింగ్ ధాటికి కంగారు బ్యాట్స్ మెన్స్ వణికిపోయారు. రెండో ఇన్నింగ్స్ లో జడేజా 7 వికెట్లు తీసుకున్నాడు. అతడికి తోడుగా.. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ గెలుపుతో.. 2-0 ఆధిక్యంలో కి భారత్ వెళ్లింది.
ఇంకో టెస్టు గెలిస్తే మనదే సిరీస్..
బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఆసీస్ నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని భారత్ 26.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. టీమిండియా బ్యాటింగ్ లో పుజారా 31 పరుగులతో.. మ్యాచ్ విన్నింగ్ లో కీలక పాత్ర పోషించాడు. తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ రెండో ఇన్నింగ్స్ లో సత్తా చాటాడు. 22 బంతుల్లో 23 పరుగులు చేసి పుజారాకు తనవంతు సాయం అందించాడు. ఆసీస్ బౌలింగ్ లో నాథన లయన్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
గత రెండు సిరీస్ లు మనవే..
ఇక గత రెండు సార్లు.. బోర్డర్ గావాస్కర్ ట్రోఫిని భారత్ గెలుచుకుంది. ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ కు.. రవీంద్ర జడేజా చుక్కలు చూపించాడు. ఏడు వికెట్లు తీసిన జడ్డూ.. ఆస్ట్రేలియాను ఉక్కిరిబిక్కిరి చేశాడు. దీంతో.. ఆసీస్ కేవలం 31.1 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. మూడో రోజు బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియాను తొలి ఓవర్లోనే అశ్విన్ దెబ్బ తీశాడు. ఒక అద్భుత బంతికి దూకుడు మీద ఉన్న ట్రావిస్ హెడ్ ను అవుట్ చేశాడు. అనంతరం స్మిత్ (9)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మరో ఎండ్ లో బాగా ఆడుతున్న మార్నస్ లబుషేన్ ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక ఇక్కడి నుంచి ఆసీస్ పెవిలియన్ కు క్యూ కట్టింది.
పూజారా కోసం వికెట్‌ను త్యాగం చేసిన రోహిత్
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో రోహిత్ శర్మ మ్యాచ్ తో పాటు.. రోహిత్ శర్మ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పూజారా కోసం రోహిత్ తన వికెట్‌ను త్యాగం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. రెండు పరుగు కోసం ప్రయత్నించి రోహిత్ రనౌట్ అయ్యాడు. మరో పరుగు వద్దని రోహిత్ చెప్పిన పూజారా వినకుండా క్రీజు దాటేసి వచ్చాడు. ఇది గమనించిన రోహిత్ శర్మ.. పూజారా కోసం తన వికెట్ ను సమర్పించుకున్నాడు. వికెట్ ను త్యాగం చేసిన రోహిత్ శర్మపై భిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
రవీంద్ర జడేజా అరుదైన ఘనత..
రెండో టెస్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో జడేజా 7 వికెట్లతో చెలరేగిపోయాడు. 12.1 ఓవర్లలో కేవలం 42 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్లు తీసుకున్నాడు. దీంతో టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు. ఈ ఏడు వికెట్లలో.. ఐదు బౌల్డ్‌లు ఉండడం గమానార్హం. గత 50 ఏళ్లలో అనిల్ కుంబ్లే తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు బౌల్డ్‌లు చేసిన ఏకైక భారత స్పిన్నర్‌గా జడేజా రికార్డు నెలకొల్పాడు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/