Site icon Prime9

IND VS AUS 4th Test Match : నేడు జరగనున్న భారత్ vs ఆసీస్ మ్యాచ్ వీక్షించనున్న ప్రధాని మోదీ, ఆసీస్ ప్రధాని ఆంటోని..

india and australia prime ministers going to watch today IND VS AUS 4th Test Match

india and australia prime ministers going to watch today IND VS AUS 4th Test Match

IND VS AUS 4th Test Match : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న పోరు చివరి దశకు చేరుకుంది. నేడు అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉదయం 9 గంటలకు నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. చివరి టెస్ట్ మ్యాచ్‌లో గెలుపు కోసం పోటాపోటీగా ఇరుజట్లు బరిలోకి దిగుతుండడంతో ఈ మ్యాచ్ కీలకంగా మారింది.  కాగా, బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు భారత్ విజయం సాధించగా.. మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలిచింది. దాంతో ఈ సిరీస్ గెలుచుకోవాలంటే.. నాలుగో టెస్ట్‌లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్స్ కు చేరాలంటే చివరిదైన నాలుగో టెస్టులో టీమిండియా తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. ఒకవేళ ఓడినా, డ్రా చేసుకున్నా భారత్ ఫైనల్ చేరాలంటే శ్రీలంక, కివీస్ టెస్టు సిరీస్ పై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్ భారత్ కి కీలకంగా మారింది.

కాగా మరోవైపు ఈరోజు జరుగనున్న ఈ నెలుగో టెస్టు మ్యాచ్ భారత్, ఆసీస్ ప్లేయర్లతో పాటు ఆయా దేశ పౌరులకు కూడా చాలా ప్రత్యేకంగా నిలువనుంది. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌కు భారత్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానులు హాజరవుతుండడమే. ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు భారత ప్రధాని మోదీతో పాటు.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌ రానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆసీస్ ప్రధాని ఆంటోని భారత్ చేరుకున్న విషయం తెలిసిందే.  కాగా వీరిద్దరూ కలిసి భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌ కి ముందు ప్రధాని మోదీ టాస్ వేయనుండడం గమనార్హం.

 

75 సంవత్సరాల ఇండో – ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా ఇరు ప్రధానులు స్టేడియంకు రానున్నారు. ఉదయం 8.30 గంటలకు ఇరు దేశాల ప్రధానులు స్టేడియంకు చేరుకోనున్నారు. ఆటగాళ్లతో ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలుస్తోంది. ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు ఇద్దరు ప్రధానులు స్టేడియంలోనే ఉండనున్నారు. ప్రధానులు స్టేడియంకు రానున్న నేపథ్యంలో ఎస్పీజీ భద్రతను కట్టుదిట్టం చేసింది. స్టేడియం భద్రత బాధ్యతను ఎస్పీజీ తన చేతుల్లోకి తీసుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో చిన్న వేదికను ఏర్పాటు చేసి.. ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ వేదిక పై నుంచి ఇద్దరు ప్రధానులు ఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఇప్పటికే భారత్ అభిమానులంతా భారీ ఎత్తున స్టేడియం వద్దకు చేరుకున్నారు. నరేంద్ర మోదీ స్టేడియం చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ ఎస్పీజీ కనుసన్నల్లో.. భద్రతా వలయాల మధ్య కట్టుదిట్టంగా ఉంచారు. మరి కొద్ది సేపట్లో మ్యాచ్ స్టార్ట్ కానుంది.

 

ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఇద్దరు ప్రధానులు వస్తుండటంతో ఫుల్ క్రేజ్ వస్తోంది. దీంతో మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇద్దరు ప్రధానులు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు పకడ్భందీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 75 వేల టికెట్లు స్టేడియంలో అమ్ముడయ్యాయని సమాచారం అందుతుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version