Site icon Prime9

IND vs SA : సొంత గడ్డ పై సిరీస్ ను సాధించిన టీమిండియా !

ind vs sa 2 prime9news

ind vs sa 2 prime9news

IND vs SA : నిన్న రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో సౌతాఫ్రికాపై టీమిండియా 16 పరుగుల తేడాతో విజయాన్ని ఛేజించింది. దక్షిణాఫ్రికాపై వరసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను గెలుపొందింది.సొంత గడ్డ మీద సౌతాఫ్రికాపై టీమిండియా ఇదే తొలి టీ20 సిరీస్ కావడం విశేషం.2015 నుంచి సౌతాఫ్రికా పై నాలుగుసార్లు టీమిండియా సొంత గడ్డ మీద టీ20 సిరీస్‌లు ఆడగా..మొదట సారి ఆడిన మ్యాచ్ సిరీస్‌ కోల్పోయినా టీమిండియా ఆ తర్వాత రెండుసార్లు మాత్రం సిరీస్‌‌ను డ్రాగా ముగిసింది.ధోనీ, కోహ్లి, పంత్ కెప్టెన్సీల్లో సొంత గడ్డ మీద సౌతాఫ్రికాపై టీ20 సిరీస్ గెలవలేదు..ఇప్పుడు ఈ సిరీస్ రోహిత్ నాయకత్వంలో సిరీస్ గెలుపొందింది.

టాస్ గెలిచిన సౌతాఫ్రికా మొదటిగా ఫీల్డింగ్ ఎంచుకుంది.ఇక మొదటిగా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే రోహిత్ 37 బాల్స్ కు 43 పరుగులు,కేఎల్ రాహుల్ 28 బాల్స్ కు 57 పరుగులు, విరాట్ కోహ్లీ 28 బాల్స్ కు 49 పరుగులు,సూర్యా కుమార్ యాదవ్ 22 బాల్స్ కు 61 పరుగులు చేశారు.రాబాడ 2 వికెట్స్ తీసుకున్నాడు.సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే డీకాక్ 48 బాల్స్ కు 69 పరుగులు,బావుమా (0 ) పరుగులు, మార్కారం 19 బాల్స్ కు 33 పరుగులు చేశాడు.హర్ష దీప్ సింగ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నాడు.

 

ఇదీ  చదవండి : Ind vs SA: సౌత్ఆఫ్రికా పై టీమిండియా బోణి కొట్టేసింది!

Exit mobile version