Site icon Prime9

IND vs SA 2 ODI : సెంచరితో చెలరేగిన శ్రేయస్ అయ్యర్

sheryas prime9news

sheryas prime9news

IND vs SA 2 ODI : సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.బరిలోకి దిగిన టీమిండియా 279 పరుగుల లక్ష్యాన్ని 45.5 ఓవర్లలోనే చేధించింది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే ఇషాన్ కిషన్ 84 బాల్స్ కు (93) పరుగులు, 111 బాల్స్ కు శ్రేయస్ అయ్యర్ (113 నాటౌట్) పరుగులు, సంజు శాంసన్ 36 బాల్స్ కు 30 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికాపై ఆడిన మొదటి మ్యాచ్ల్ అర్ధ శతకం బాదిన అయ్యర్.. నిన్న రాంచీ వన్డేలో కూడా సెంచరీ చేసి చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టును గెలిపించాడు.ఆరంభంలో పేసర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడిన ఇషాన్ తడ బడగా అయ్యర్ మాత్రం స్ట్రయిక్ రేట్ పడిపోకుండా తన ఆటను కొనసాగించాడు.ఈ మ్యాచ్‌లో శ్రేయస్ సెంచరీ చేయడం ద్వారా వన్డేల్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ బాదిన తొలి భారత బ్యాటర్‌గా శ్రేయస్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఈ మధ్య కాలంలో శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.వన్డే ఫార్మాట్లో 6 ఇన్నింగ్స్‌ చూసుకుంటే అయ్యర్‌ 4 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ బాదడం గమనార్హం. శ్రేయస్ అయ్యర్ చివరి 6 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అయ్యర్ స్కోర్లు వరుసగా.. 113*(111), 50 (38), 44 (34), 63 (71), 54 (57), 80 (111).దీన్ని బట్టి శ్రేయస్ అయ్యర్ ఎలాంటి ఫామ్‌‌లో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.ఈ ఏడాది వన్డేల్లో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ యావరేజ్ 57.25 కావడం విశేషం.ఇప్పటి వరకూ 32 వన్డేలు ఆడిన శ్రేయస్ అయ్యర్‌కు ఇది రెండో సెంచరీ. మొదటి సెంచరీని న్యూజిలాండ్‌పై చేశాడు.

ఇదీ  చదవండి : Roger Binny: గంగూలీ వారసుడిగా రోజర్ బిన్నీ?

Exit mobile version