IND Vs NZ 2nd T20: మెుదటి టీ20లో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. వన్డే సిరీస్ తర్వాత ఉత్సాహంతో బరిలోకి దిగిన టీమిండియాకు పరాభవం ఎదురైంది. మెుదటి టీ20లో బౌలర్లు, బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ సిరీస్ పై ఆశలు నిలుపుకోవాలంటే.. భారత్ ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఒకవేళా ఒడితే మాత్రం సిరీస్ ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంటుంది.
లక్నో వేదికగా.. నేడు టీమిండియా న్యూజిలాండ్ (IND Vs NZ 2nd T20) తో తలపడనుంది. మెుదటి టీ20 గెలుపుతో కివీస్ జోరు మీద ఉంది.
మెుదటి మ్యాచ్ ఓటమితో భారత్ నిరాశలో ఉంది. మూడు మ్యాచ్‌ల సిరీస్ లో న్యూజిలాండ్ మెుదటి విజయాన్ని సాధించింది.
రాంచిలో జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ భారత్ కు పెద్ద షాకే ఇచ్చింది. హార్దిక్ సేన బౌలింగ్, బ్యాటింగ్ రెండింట్లో తగిన ప్రదర్శన చేయలేకపోయింది.
మెుదటి టీ20లో బౌలింగ్‌లో లభించిన ఆరంభాన్ని టీమిండియా ఉపయోగించుకోలేపోయింది.
దీంతో ప్రత్యర్థి 170 పైగా పరుగులు సాధించారు. చివరి ఓవర్ వేసిన అర్షదీప్.. ఆ ఓవర్ల ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక లక్ష్య ఛేదనలో బ్యాటర్లు తేలిపోయారు. సూర్యకుమార్, వాషింగ్టన్ సుందర్ మినహా ఏ ఒక్కరు పోరాటం చేయలేకపోయారు.
భారత్ నిలకడగా విజయాలు సాధిస్తున్న.. ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం అంతగా బాగలేదు.
ప్రపంచకప్ తర్వాత రోహిత్, కోహ్లి, రాహుల్ టీ20లకు దూరంగా ఉంటున్నారు.
వారి స్థానాల్లో ఆడుతున్న యువ ఆటగాళ్లు మాత్రం వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం లేదు.
ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా అవకాశాలను ఉపయోగించుకోవడం లేదు.
వ్యక్తిగతంగా.. అటూ కెప్టెన్ గా పాండ్యా Hardik Pandya కూడా ఇబ్బంది పడుతున్నాడు. నేడు జరిగే మ్యాచ్ లో పాండ్యా రాణిస్తేణే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సూర్యకుమార్, వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకుంటున్నారు.
కుల్‌దీప్ చక్కటి ఫామ్‌ను కొనసాగిస్తుండటం భారత్ కు కలిసొచ్చే అంశం. అర్షదీప్ బౌలింగ్ ఆందోళనగా ఉంది.
నేడు జరిగే మ్యాచ్ లో రెండు మార్పులు జరగనున్నట్లు తెలుస్తుంది. రాంచీ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో భారీగా పరుగులు ఇచ్చిన అర్షదీప్ పై వేటు పడనుంది.
ఇతడి స్థానంలో ముకేశ్ కుమార్ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తుంది. త్రిపాఠి స్థానంలో.. పృథ్వీ షా బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇదే జరిగితే ఇషాన్ కిషన్.. లేదా పృథ్వీ షా గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/