Site icon Prime9

2nd T20: చెలరేగిన భారత బౌలర్లు.. కుప్పకూలిన కివీస్

ind vs nz 2 t20

ind vs nz 2 t20

2nd T20: లక్నో వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ బెంబేలెత్తారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్..
వరుస వికెట్లు కోల్పోయింది. ఇక మెుదటి మెుదటి టీ20లో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.

లక్నో వేదికగా.. నేడు రెండో టీ20 (2nd T20) జరుగుతుంది.
టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఆదిలోనే కివీస్ బ్యాట్స్ మెన్స్ తడబడ్డారు.

భారత బౌలర్ల ధాటికి.. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు.

వరుస వికెట్లు కోల్పోవడంతో.. కివీస్ స్కోర్ నెమ్మదించింది.
మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

కివీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి.. 99 పరుగులు చేసింది.

భారత్ లక్ష్యం 120 బంతుల్లో 100 పరుగులు.

 

రెచ్చిపోయిన భారత బౌలర్లు

భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు నానా తంటాలు పడుతున్న కివీస్ బ్యాట్స్ మెన్.

వికెట్ల వేటను ప్రారంభించిన చాహల్.

తొలి ఓవర్ లోనే వికెట్ తీసుకున్న చాహల్. ఫిన్ అలెన్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

డెవాన్ కాన్వే కూడా త్వరగా.. సుందర్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్ మెన్ కూడా సరిగ్గా ఆడలేకపోయాడు.

భారత బౌలింగ్ లో అర్షదీప్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

కుల్దీప్ యాదవ్, దీపక్ హూడా, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.

వీరికి తోడుగా పాండ్యా Hardik Pandya, సుందర్ కూడా తల ఓ వికెట్ పడగొట్టారు.

కనీసం వంద పరుగులు దాటలేని స్థితిలో కివీస్.
ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచే అవకాశం.

ఈ మ్యాచ్ భారత్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీనస్ ను ఇండియా సమం చేస్తుంది.

బౌలింగ్ లో రాణించిన యుజ్వేంద్ర చాహల్.

రెండు ఓవర్లలో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చిన చాహల్.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version