IND vs AUS Test: నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పై చేయి సాధించింది. ప్రస్తుతం టీమిండియా 144 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఓ దశలో రెండో రోజు ఆసీస్ పై చేయి సాధించేలా కనిపించినా.. చివరికి బ్యాటర్లు రాణించండంతో భారత్ మెరుగైన స్కోర్ సాధించింది. మెుదట్లో వికెట్లు కోల్పోయిన భారత్.. చివర్లో పట్టుదలతో రాణించింది. చివర్లో జడేజా, అక్షర్ బ్యాటింగ్ తో భారత్ భారీ ఆధిక్యంలోకి వెళ్లింది.
భారీ స్కోర్ దిశగా టీమిండియా.. IND vs AUS Test
రెండు రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా.. 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ప్రస్తుతం జడేజా 66, అక్షర్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. దీంతో 144 పరుగుల ఆధిక్యంలో టీమ్ ఇండియా కొనసాగుతోంది. రెండు రోజు ఆట ప్రారంభంలో ఆసీస్ బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేశారు. ఓ దశలో కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియాకు చివర్లో.. జడేజా, అక్షర్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 300 పరుగులను చేరుకొగలిగింది. మ్యాచ్ ప్రారంభం నుంచి స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న పిచ్ మూడో రోజుకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దీంతో రెండో ఇన్నింగ్స్ ఆడే జట్టు.. పరుగులు చేయడానికి ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
ఆకట్టుకున్న ఆసీస్ కుర్రాడు..
రెండో రోజు ఆటలో ఆసీస్ కుర్రాడు రాణించాడు. ఈ మ్యాచ్ లో టాడ్ మర్ఫీ ఐదు వికెట్లతో రాణించడం ఒక్కటే ఆసీస్ కు కలసివచ్చింది. ఈ 22 ఏళ్ల ఈ కుర్రాడికి ఇదే తొలి అంతర్జాతీయ టెస్టు కావడం విశేషం. ఆడిన మెుదటి మ్యాచ్ లోనే ఐదు వికెట్లు తీశాడు. ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌తో కీలక వికెట్లను తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆసీస్ స్టార్ స్పిన్నర్.. నాథన్ లియోన్ ప్రభావం చూపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా టాడ్ మర్ఫీ ఈ మ్యాచ్ లో హైలెట్ అయ్యాడు.
ఆసీస్ బ్యాటర్లు బెదిరిపోయిన పిచ్ పై.. భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. దానికి కెప్టెన్ రోహిత్ శర్మ శతకంతోపాటు.. ఆల్‌రౌండర్లు జడేజా, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌లే కారణం. ఇక మూడో రోజు ఆటలోనూ
టీమిండియా ఆటగాళ్లు రాణిస్తే తొలి టెస్టుపై దాదాపు విజయం సాధించినట్లే.