Site icon Prime9

Ind vs Aus 4th Test: నాల్గో టెస్టు మ్యాచ్ లో సందడి చేసిన ఇద్దరు ప్రధానులు..

Ind vs Aus 4th Test

Ind vs Aus 4th Test

Ind vs Aus 4th Test: భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

నాల్గో టెస్టు మ్యాచ్ చూసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ నరేంద్రమోదీ స్టేడియానికి వచ్చారు.

 

 

నాల్గో టెస్టులో స్పెషల్ అట్రాక్షన్( Ind vs Aus 4th Test)

75 ఏళ్ల భారత్- ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా వీరిద్దరూ మ్యాచ్‎ను ప్రత్యేక్షంగా వీక్షించారు.

ఒక వైపు నాల్గో టెస్టు మ్యాచ్ సిరీస్‎ను డిసైడ్ చేయనుండగా.. మరోవైపు ఇరు దేశాల ప్రధానులు రావడంతో స్టేడియం మొత్తం క్రికెట్ అభిమానులతో కిక్కిరిసిపోయింది.

ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ఇద్దరు ప్రధానులను బీసీసీఐ ప్రత్యేకంగా సత్కరించింది.

భారత్-ఆస్ట్రేలియా మధ్య 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. ఆస్ట్రేలియా ప్రధాని అంటోనీ ఆల్బనీస్(Antony Albanese) కు మెమొంటోను గుర్తుగా ఇచ్చారు.

మరో వైపు బీసీసీఐ కార్యదర్శి జై. షా కూడా ప్రధాని మోదీకి జ్ఞాపికను అందజేశారు.

 

 

 

స్టేడియం అంతా తిరుగుతూ

కాగా, మ్యాచ్‎కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు.. ప్రధాని మోదీ(Narendra Modi), ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‎కు.. ఆసీస్ ప్రధాని టెస్టు మ్యాచ్ క్యాప్‎లు అందజేశారు.

అనంతరం ఇద్దరు ప్రధానులు గోల్డ్ పూతతో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న గోల్ఫ్ కారులో స్టేడియం అంతా తిరుగుతూ అభిమానులను పలకరించారు.

తర్వాత ఇద్దరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. మ్యాచ్ ప్రారంభం అయ్యాక ఇద్దరూ ప్రత్యేక గ్యాలరీ ద్వారా మ్యాచ్‎ను చూశారు.

వాటికి సంబంధించిన వీడియోలను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

 

 

తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‎

ఇప్పటికే ఈ సిరీస్‎(Ind vs Aus 4th Test) లో టీమిండియా జట్టు 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ సిరీ‌స్‎ను నెగ్గేందుకు,

అటు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిష్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో చోటు దక్కించుకునేందుకు కూడా నాల్గో టెస్టు మ్యాచ్ ఆఖరిది.

భారత్ జట్టుకు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‎ ఇది. ఇక టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.

 

Exit mobile version