Site icon Prime9

Ind Vs Aus 4th Test: ఐదో రోజు ఆట.. మెుదటి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

Ind Vs Aus 3rd Test

Ind Vs Aus 3rd Test

Ind Vs Aus 4th Test: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఐదో రోజు ఆట కొనసాగుతుంది. మెుదటి సెషల్ లో ఆసీస్ తన మెుదటి వికెట్ ని కోల్పోయింది. స్పిన్నర్.. రవిచంద్రన్ అశ్విన్ భారత్ కు తొలి వికెట్ అందించాడు.

తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. (Ind Vs Aus 4th Test)

ఐదో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో ఆసీస్ ఓపెనర్.. కుహ్నెమన్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా చివరి టెస్టు.. ఐదో రోజు కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులకు ఆలౌట్ అయింది. కంగారు జట్టు బ్యాటింగ్ ఉస్మాన్ ఖవాజా, కామెరున్ గ్రీన్ సెంచరీలతో రాణించారు.

తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోర్..

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ భారీ స్కోర్ సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ శతకాలతో చెలరేగారు. వీరికి తోడు.. అక్షర్ పటెల్ 79 పరుగులతో రాణించాడు. ఇక వెన్నెముక గాయంతో.. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయలేదు. విరాట్‌ కోహ్లి 364 బంతుల్లో 186 పరుగులు సాధించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 178.5 ఓవర్లలో 571 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో కీలకమైన 91 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆఖరి రోజు సోమవారం ఉదయం ఆతిథ్య బౌలర్లు కూడా సమష్టిగా ఓ చేయి వేసి… ఆసీస్‌ను 200 పరుగుల్లోపు కట్టడి చేస్తే ఛేదించే లక్ష్యం మన ముందుంటుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బెర్త్‌ వేటకు శుభం కార్డు పడుతుంది.

శ్రేయస్‌కు గాయం..

నడుము నొప్పి ఎక్కువ కావడంతో.. శ్రేయస్‌ అయ్యర్ బ్యాటింగ్‌కు కూడా దిగలేకపోయాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లను కోల్పోయినప్పటికీ ఆలౌట్‌గా పరిగణించాల్సి వచ్చింది. ఇదే మ్యాచ్‌తోపాటు ఆసీస్‌తో వన్డే సిరీస్‌కూ శ్రేయస్‌ ఆడటం కష్టమే. అతడి స్థానంలో కేఎల్‌ రాహుల్‌ ఫీల్డింగ్‌కు వచ్చాడు.

మూడున్నరేళ్ల తర్వాత కోహ్లీ శతకం..

నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో.. నాలుగో రోజు శతకం బాదాడు. విరాట్ దాదాపు 1200 రోజుల నుంచి టెస్టుల్లో సెంచరీ కోసం వేచి చూస్తున్నాడు. 1200 రోజుల నీరిక్షణకు నేడు తెరపడింది. వన్డేలు, టీ20ల్లో సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం మూడంకెల స్కోరు కోసం దాదాపు మూడున్నరేళ్లపాటు వేచి చూడాల్సి వచ్చింది. టెస్టుల్లో విరాట్‌కిది 28వ శతకం కాగా.. అన్ని ఫార్మాట్లలో కలిసి మొత్తంగా 75 సెంచరీలు సాధించాడు. కోహ్లీ 241బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. విరాట్ 2019 నవంబర్‌ 22న బంగ్లాదేశ్‌ పై చివరిసారిగా టెస్టు శతకం సాధించాడు.

Exit mobile version
Skip to toolbar