Site icon Prime9

IND vs AUS 2nd Test: ఆసీస్ తో రెండో టెస్ట్.. అశ్విన్, జడేజా రికార్డులు!

2nd test

2nd test

IND vs AUS 2nd Test: దిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు రాణించారు. ఆస్ట్రేలియాను 263 పరుగులకు కట్టడి చేశారు. ఉస్మాన్ ఖవాజా.. హ్యాండ్స్ కాంబ్ ఇద్దరు మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో షమీ నాలుగు వికెట్లు తీయగా.. అశ్విన్, జడేజా లు చెరో మూడు వికెట్లు తీశారు.

తడిబడిన ఆసీస్ బ్యాటర్లు.. (IND vs AUS 2nd Test)

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఆది నుంచే తడబడుతూ బ్యాటింగ్ కొనసాగించింది. ఓపెనర్ డెవిడ్ వార్నర్ తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. ఆసీస్ బ్యాటింగ్ లో ఉస్మాన్ ఖవాజా.. హ్యాండ్స్ కాంబ్ మినాహా ఓ ఒక్కరు రాణించలేదు. దీంతో కంగారు జట్టు 263 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. షమీ నాలుగు వికెట్లు తీసుకోగా.. అశ్విన్, జడేజా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఇక తొని ఇన్నింగ్స్ లో సిరాజ్, అక్సర్ ఒక్క వికెట్ తీయలేదు. మెుదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. వికెట్ నష్టపోకుండా.. 21 పరుగులు చేసింది. దీంతో మెుదటి రోజు భారత్ పై చేయి సాధించింది.

రికార్డులు సృష్టించిన అశ్విన్, జడేజా!

బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో టీమిండియా స్పిన్నర్లు.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా రికార్డులు సృష్టించారు. ఆసీస్ తో జరిగిన టెస్టుల్లో.. వంద వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. అలాగే.. మెుత్తం టెస్టుల్లో 250 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. దీంతో అశ్విన్ టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే తర్వాత కొనసాగుతున్నాడు. అనిల్ కుంబ్లే.. ఆస్ట్రేలియాపై 111 వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు ఆటలో ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అలెక్స్‌ కారేను అశ్విన్ డకౌట్‌ చేశాడు. దీంతో ఆసీస్‌పై వంద వికెట్ల మార్కును అందుకున్నాడు. ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షేన్‌ వార్న్‌ నిలిచాడు. ఒకే జట్టుపై 195 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో మెుదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

రెండో టెస్టులో రవీంద్ర జడేజా మరో రికార్డ్ సృష్టించాడు. టెస్టుల్లో 250 వికెట్లు పడగొట్టిన బౌలర్ గా మరో మైలురాయి అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఖవాజాను ఔట్‌ చేసిన జడ్డూ.. ఈ ఫీట్‌ ను నమోదు చేశాడు. టెస్టుల్లో 250 వికెట్ల మార్కును అందుకున్న ఎనిమిదో భారత బౌలర్‌గా జడ్డూ నిలిచాడు. అదే విధంగా.. టెస్టు‍ల్లో 2500 పరుగులతో పాటు 250 వికెట్లు సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా జడేజా ఈ ఘనత సాధించాడు. ఇక టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2500 పరుగులతో పాటు.. 250 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

Exit mobile version