Ind Vs Aus 1st ODI: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మెుదటి వన్డేలో భారత బౌలర్లు శుభారంభం అందించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఆదిలోనే ఆసీస్ వికెట్ తీసింది.
రెండో ఓవర్ లోనే మహ్మద్ సిరాజ్.. ట్రావిస్ హెడ్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ (Ind Vs Aus 1st ODI)
ముంబైలోని వాంఖడే స్డేడియం వేదికగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా.. బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో.. హార్ధిక్ పాండ్యా జట్టు పగ్గాలు అందుకున్నాడు. బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు 5 పరుగులు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను మహ్మద్ సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆసీస్ బ్యాటర్లు ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆరు ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు.. 37 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఇక ఈ మ్యాచ్ లో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. ఈ సిరీస్‌కు ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో ఆ జట్టు స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫిని టిమిండియా సొంతం చేసుకుంది.