Prime9

ICC test Rankings: టెస్టుల్లో నెంబర్ వన్ కు ఎగబాకిన టీమిండియా

ICC test Rankings:టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా నెంబర్ వన్ స్థానానికి ఎకబాకింది. మే 2 న ఐసీసీ ఎంఆర్ఎఫ్ వార్షిక టెస్ట్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉన్న భారత్.. ఆస్ట్రేలియాను దాటి టాప్ ప్లేసులోకి దూసుకెళ్లింది. దాదాపు 15 నెలలుగా ఆస్ట్రేలియా అగ్ర పీఠంపై కొనసాగుతోంది.

జూన్ 7 లో జరుగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ జరుగనుంది. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియా – టీమిండియా మధ్య డబ్ల్యూటీసీ టైటిల్ పోరు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ టాప్ ర్యాంక్ లోకి అందుకోవడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

 

తొలి 10 ర్యాంకులు

ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో భారత్‌ (121), ఆస్ట్రేలియా (116) తర్వాత ఇంగ్లండ్‌ (114), సౌతాఫ్రికా (104), న్యూజిలాండ్‌ (100), పాకిస్థాన్‌ (86), శ్రీలంక (84), వెస్టిండీస్‌ (76), బంగ్లాదేశ్‌ (45), జింబాబ్వే (32) వరుసగా 3 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి.

 

Exit mobile version
Skip to toolbar