ICC T20 Team: టీ20లో అత్యుత్తమ ఆటగాళ్లతో రూపొందించిన జాబితాను ఐసీసీ ప్రకటించింది. 2022లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో కూడిన జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. 11 మంది సభ్యుల గల జాబితాలో ఇండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు స్థానం సంపాదించుకున్నారు.
గతేడాది టీ20లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్ల జాబితా విడుదలైంది.
2022కి సంబంధించి అత్యుత్తమ పురుషుల టీ20-2022 జట్టు పేరుతో ఈ జాబితాను విడుదల చేశారు.
ఈ జట్టులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు స్థానం సంపాదించుకున్నారు. ఇక ఈ జట్టుకు ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ ను కెప్టెన్ గా ఎంపిక చేసింది.
గత ఏడాది.. ఈ ఫార్మాట్ లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన ఆటగాళ్లను పరిగణలోకి తీసుకున్న ఐసీసీ.. 11 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను వెల్లడించింది.
పురుషులతో పాటు.. మహిళల అత్యుత్తమ జట్టును సైతం ప్రకటించింది.
పురుషుల విభాగంలో ఓపెనర్లుగా ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్.. పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ ను ఐసీసీ ఎంపిక చేసింది.
ఇక మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ.. నాల్గవ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేసింది.
న్యూజిలాండ్ కు చెందిన గ్లెన్ ఫిలిప్స్.. ఆల్‌రౌండర్ల కోటాలో జింబాబ్వేకు చెందిన సికందర్ రజా.. హార్ధిక్ పాండ్యా, సామ్ కరన్ లను పరిగణలోకి తీసుకుంది.
స్పిన్ బౌలింగ్ లో వాహిందు హసరంగా.. పేసర్లుగా పాకిస్థాన్ కు చెందిన హరీస్ రౌఫ్, జోష్ లిటిల్ ని ఎంపిక చేసింది.
2022లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ సుపార్ ఫామ్ తో రాణించాడు. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో 82 రన్స్ చేసి జట్టును ఒంటి విజయతీరాలకు చేర్చాడు.
సూర్యకుమార్ కూడా మంచి ఫామ్ కొనసాగించాడు. 2022లో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సూర్య నిలిచాడు.
టీ20 వరల్డ్ కప్‌లో సూర్య కుమార్ 189.69 స్ట్రైక్ రేట్‌తో 239 రన్స్ చేశాడు.
గతేడాది హార్దిక్ పాండ్యా సైతం దుమ్మురేపాడు. ఆల్‌రౌండ్ ప్రతిభతో గతేడాది 607 రన్స్ చేసి 20 వికెట్లు తీశాడు.
పురుషుల అత్యుత్తమ టీ20 జట్టు-2022
జాస్ బట్లర్ (కెప్టెన్, ఇంగ్లాండ్), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ (ఇండియా), గ్లెన్ ఫిలిప్స్
(న్యూజిలాండ్), సికిందర్ రాజా (జింబాబ్వే), హార్దిక్ పాండ్యా (ఇండియా), సామ్ కరన్ (ఇంగ్లాండ్), హసరంగ (శ్రీలంక). హరీస్ రౌఫ్, జోష్ లిటిల్.
ఇక మహిళల జట్టులో ఏకంగా నలుగు భారత మహిళ క్రికెటర్లు స్థానం సంపాదించారు. ఓపెనర్‌గా స్మృతి మంధాన ఎంపికైంది.
ఆల్‌రౌండర్ విభాగంలో దీప్తి శర్మ, వికెట్ కీపర్‌గా రిచా ఘోష్, బౌలర్ల విభాగంలో రేణుకా సింగ్‌కు అవకాశం లభించింది. న్యూజిలాండ్ కు చెందిన సోఫీ డివైన్‌ను కెప్టెన్‌గా ఎంపికచేశారు.
మహిళల అత్యుత్తమ టీ20 జట్టు-2022
స్మృతి మంధాన (ఇండియా), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), సోఫీ డివైన్ (న్యూజిలాండ్, కెప్టెన్), ఆష్ గార్డెనర్ (ఆస్ట్రేలియా)
తహ్లియా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా), నిదా దర్ (పాకిస్తాన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (ఇండియా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్), ఇనోకా రణవీర (శ్రీలంక), రేణుకా సింగ్ (ఇండియా)
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/